ఒలింపిక్స్‌ 2028లో క్రికెట్‌ మ్యాచ్‌ల షెడ్యూలు విడుదల

by Yella Dhawani Reddy |

2028లో లాస్‌ఏంజెలెస్‌‌లో నిర్వహించబోయే ఒలింపిక్స్‌ (Olympics) క్రీడల్లో క్రికెట్‌ కూడా చేరింది. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదలైంది.

ఒలింపిక్స్‌ 2028లో క్రికెట్‌ మ్యాచ్‌ల షెడ్యూలు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: 2028లో లాస్‌ఏంజెలెస్‌‌లో నిర్వహించబోయే ఒలింపిక్స్‌ (Olympics) క్రీడల్లో క్రికెట్‌ కూడా చేరింది. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదలైంది. టీ20 ఫార్మాట్‌లో క్రికెట్‌ మ్యాచ్‌లు జులై 12 నుంచి జులై 29 వరకు జరుగనున్నట్లు ఒలింపిక్‌ కమిటీ షెడ్యూల్‌లో పేర్కొంది. దాదాపు 17 రోజులపాటు ఈ పోటీలు కొనసాగనున్నాయి. పురుషులు, మహిళల విభాగాల్లో టోర్నమెంట్లు నిర్వహించనున్నారు.

క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు లభించడం క్రీడాభిమానులకు సంతోషకరమైన విషయంగా మారింది. ఐసీసీ సహకారంతో టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. టీ20 ఫార్మాట్‌ వల్ల క్రికెట్‌కు గ్లోబల్ స్థాయిలో మరింత ఆదరణ లభించే అవకాశముంది.

Next Story