ఆ టెస్టు సిరీస్ షెడ్యూల్ మార్చండి.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కోరిన ఆసీస్

by Vinod kumar |

ఆ టెస్టు సిరీస్ షెడ్యూల్ మార్చండి.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కోరిన ఆసీస్
X

దిశ, వెబ్‌డెస్క్: సొంత‌గ‌డ్డపై న్యూజిలాండ్‌పై చారిత్రాత్మక టెస్టు విజ‌యం న‌మోదు చేసిన బంగ్లాదేశ్.. త‌మ‌ను త‌క్కువ అంచ‌నా వేయొద్దని మ‌రోసారి చాటింది. గ‌త కొంత కాలంగా వ‌న్డేలు, టీ20ల‌తో పాటు టెస్టు ఫార్మాట్‌లోనూ రాణిస్తున్న బంగ్లా 2027లో ఆసీస్ ప‌ర్యట‌న‌కు వెళ్లనుంది. అయితే.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆ టెస్టు సిరీస్‌ను రీ-షెడ్యూల్ చేయాల‌ని మంగ‌ళ‌వారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును అభ్యర్థించింది.

త‌మ జ‌ట్టును 2026 ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్ మ‌ధ్య ఆసీస్‌కు పంపాల‌ని బీసీబీని కోరింది. కంగారూ బోర్డు ప్రతిపాద‌న‌పై బంగ్లా క్రికెట్ బోర్డు ఇంకా బదులివ్వాల్సి ఉంది. ‘ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇరుదేశాల మ‌ధ్య 2027లో జ‌రిగాల్సిన టెస్టు సిరీస్‌ను ముందుకు జ‌ర‌పాల‌ని కోరింది. అదే ఏడాది వేస‌విలో ఇంగ్లండ్‌తో 150వ టెస్టు మ్యాచ్ నిర్వహించాల‌నే ఆలోచ‌న‌తో ఆసీస్ బోర్డు మ‌మ్మల్ని ముంద‌స్తు సిరీస్ కోసం అభ్యర్థించింది. అదే విష‌యం సాధ్యాసాధ్యాల‌పై చ‌ర్చిస్తున్నాం’ అని బీసీబీ చీఫ్ నిజాముద్దీన్ చౌదురి తెలిపాడు.

Next Story