Video: టీమిండియాకు ఆసీస్ వార్నింగ్‌..ధోని లేక‌పోతే మీరు గెల‌వ‌లేరు!

by velandi.Saikiran |

ధోని గ‌తంలో కంగారుల‌పై ఆడిన ఇన్నింగ్స్ వీడియోను షేర్ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఆ స‌మ‌యంలో ధోని ఉన్నాడు కాబ‌

Video: టీమిండియాకు ఆసీస్ వార్నింగ్‌..ధోని లేక‌పోతే మీరు గెల‌వ‌లేరు!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీమిండియా వ‌ర్సెస్ ఆస్ట్రేలియా మ‌ధ్య వ‌న్డే సిరీస్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. మొన్న 19వ తేదీన ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య పెర్త్ వేదిక‌గా తొలి వ‌న్డే జ‌రిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. పెర్త్ లో వ‌ర్షం ప‌డ‌టం, ప‌దే ప‌దే మ్యాచ్ ఆగిపోవ‌డంతో టీమిండియా ఓడిపోవాల్సి వ‌చ్చింది. అయితే, ఈ మ్యాచ్ లో గెలిచిన అనంత‌రం క్రికెట్ ఆస్ట్రేలియా రెచ్చిపోతోంది. ధోని లేకుండా టీమిండియా గెలిచే స‌మ‌స్యే లేదంటూ ర్యాగింగ్ చేసే ప్ర‌య‌త్నం చేసింది.

ఇందులో భాగంగానే, ధోని గ‌తంలో కంగారుల‌పై ఆడిన ఇన్నింగ్స్ వీడియోను షేర్ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఆ స‌మ‌యంలో ధోని ఉన్నాడు కాబ‌ట్టే, టీమిండియా త‌మ‌పై గెలిచింద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేసింది ఆసీస్‌. అయితే, ఇప్పుడు ధోని లేడు, గిల్ కెప్టెన్సీలో టీమిండియా గెల‌వ‌డం క‌ష్ట‌మేనంటూ చెప్ప‌క‌నే చెప్పింది. దీంతో ఈ వీడియో వైర‌ల్ గా మారింది. ఇక ఈ వీడియోలో ధోని 112 మీట‌ర్ల సిక్స‌ర్ ను కొట్టి టీమిండియా గెలిపించాడు. ధోని కెప్టెన్సీలో గ‌తంలో ఆసీస్ గ‌డ్డ‌పై ట్రై సిరీస్ కూడా గెలిచింది టీమిండియా. క్లిక్

Next Story