- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోహ్లీ-రోహిత్‌కు ప్రత్యేక వీడ్కోలు....ఈ దేశం భారీ ప్లాన్ !
టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ ( Rohit Sharma), విరాట్ కోహ్లీల ( Virat Kohli) కోసం క్రికెట్ ఆస్ట్రేలియా భారీ ప్లా

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ ( Rohit Sharma), విరాట్ కోహ్లీల ( Virat Kohli) కోసం క్రికెట్ ఆస్ట్రేలియా భారీ ప్లాన్ చేస్తోంది. ఈ ఇద్దరు ఆటగాళ్ల కోసం వీడ్కోలు వేడుక ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా ( Cricket Australia). టీమిండియా (Team India) దిగజాలు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా... మొదట టి20 లు, ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు.
ఇద్దరూ ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఈ ఇద్దరు ఆడుతున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడి.. ఆ తర్వాత ఈ ఇద్దరు ప్లేయర్లు కూడా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. 2027 తర్వాత పూర్తిగా క్రికెట్ కు దూరం అవుతారా? లేదా? ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లు ఆడతారా అనేది తెలియాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ "ఫేర్‌వెల్" కు (Fare Well) భారీ ప్లాన్ చేస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా. అక్టోబర్ మాసంలో జరిగే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సందర్భంగా రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీలకు ఘనంగా వీడ్కోలు పలకాలని ప్లాన్ చేస్తున్నారట. ఆస్ట్రేలియాలో ఈ ఇద్దరు ప్లేయర్లు... పర్యటించడం అదే చివరి సారి కాబోతుందని.. అందుకే క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన రాబోతుంది అంటూ నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
🚨 CA PLANNING FOR KOHLI & ROHIT 🚨
— Tanuj (@ImTanujSingh) June 8, 2025
- Cricket Australia is planning to give a farewell tribute to Virat Kohli and Rohit Sharma in the ODI series as it will potentially be their last tour to Australia. (Mid Day). pic.twitter.com/rt30B9LvXS






