- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంగ్లాండ్ గడ్డపై రెచ్చిపోతున్న తిలక్.. ఖాతాలో మరో సెంచరీ
టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ ఇంగ్లాండ్ గడ్డపై అదరగొడుతున్నాడు.

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ ఇంగ్లాండ్ గడ్డపై అదరగొడుతున్నాడు. ఇంగ్లాండ్ దేశవాళీ టోర్నీ కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్ 1 టోర్నీలో హాంప్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను సంచలన ప్రదర్శన చేస్తున్నాడు. నాటింగ్‌హామ్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్ అద్భుతమైన సెంచరీ బాదాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను 256 బంతుల్లో 112 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ టోర్నీలో తిలక్‌కు ఇది రెండో శతకం. గత నెలలో ఎసెక్స్‌తో జరిగిన అరంగేట్ర మ్యాచ్‌లోనే అతను సెంచరీ చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ కొట్టడం విశేషం. తాజా మ్యాచ్‌లో నాటింగ్‌హామ్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌ను 578/8 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. ఫెలిక్స్ ఆర్గాన్‌తోపాటు తిలక్ శతక్కొట్టడంతో ప్రత్యర్థికి హాంప్‌షైర్ దీటుగా బదులిస్తోంది. ప్రస్తుతం 453/9 స్కోరు చేసిన ఆ జట్టు ఇంకా 125 పరుగులు వెనుకంజలో ఉంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఇప్పటికే నిరూపించుకున్న తిలక్ టెస్టుల్లోకి అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో తన ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు.






