Champak : IPL పెట్ డాగ్ చంపక్ పై వివాదం

by Muthe.Rajitha |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్లో BCCI ఒక రోబోటిక్ డాగ్‌(Robotic Dog)ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.

Champak : IPL పెట్ డాగ్ చంపక్ పై వివాదం
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్లో BCCI ఒక రోబోటిక్ డాగ్‌(Robotic Dog)ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీని పేరు 'చంపక్'(Champak). ఈ రోబోటిక్ డాగ్ కెమెరాతో నడుస్తూ, టాస్ సమయంలో కాయిన్ తీసుకు రావడం, ప్లేయర్స్ దగ్గరికి వెళ్ళడం.. వారితో సరదాగా హైఫై ఇవ్వడం లాంటివి చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే, తాజాగా ఈ రోబోటిక్ డాగ్ పేరు వివాదస్పదం అయింది. 'చంపక్' అనేది 1968 నుండి ఢిల్లీ ప్రెస్(Delhi Press) కంపెనీ ప్రచురిస్తున్న పిల్లల మ్యాగజైన్ పేరని.. తమ అనుమతి లేకుండానే తమ ట్రేడ్ మార్క్ ను బీసీసీఐ రోబోటిక్ డాగ్ కు పెట్టిందని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)లో పిటిషన్ దాఖలు చేసింది ప్రెస్ కంపెనీ. 'చంపక్' పేరును IPLలో వాడటం వల్ల తమ మ్యాగజైన్ గుర్తింపు తగ్గుతుందని, వ్యాపారానికి నష్టం జరుగుతుందని, తక్షణమే ఈ పేరు వాడకుండా ఆపాలని పిటిషన్ లో కోరింది.

అలాగే తమ ట్రేడ్ మార్క్ ను వాడుకున్నందుకు ₹2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని కోరింది. మరోవైపు తాము ఈ పేరు ఎంచుకోలేదని, అభిమానులు ఓటు వేసి ఈ పేరు ఎంచుకున్నారని BCCI కోర్టుకు తెలిపింది. 'చంపక్' అనేది పుష్పం పేరు, లేదా ఒక టీవీ సీరియల్ పాత్ర పేరు కావచ్చని, మ్యాగజైన్‌తో సంబంధం లేదని వాదించింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్ట్.. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని బీసీసీఐ కి నోటీసులు జారీ చేసింది. అయితే పేరు వాడకాన్ని ఆపాలని మాత్రం ఆర్డర్‌ ఇవ్వలేదు. అనంతరం తదుపరి విచారణ జూలై 9, 2025కి వాయిదా వేసింది.

Next Story