భారత కెప్టెన్ రోహిత్ శర్మ బాడీ పై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

by Malleboina Mahesh |   (  Updated:2025-03-04 12:17:08  IST  )

కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ షామా మొహమ్మద్.. భారత క్రికెట్ రోహిత్ శర్మ బాడీ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ బాడీ పై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ షామా మొహమ్మద్ (Dr. Shama Mohammad..).. భారత క్రికెట్ రోహిత్ శర్మ బాడీ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను "అధిక బరువు"ఉన్నాడని భారత్‌లో ఎన్నడూ లేని విధంగా ఆయన ఆకట్టుకోలేని కెప్టెన్"గా నిలిచాడని ఆయన వెంటనే బరువు తగ్గాలని.. న్యూజిలాండ్ పై విజయం తర్వాత ట్వీట్ చేసింది. దీంతో ఆమె వ్యాఖ్యలపై బీజేపీ, క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇందులో భాగంగా బీజేపీ నేతలు (BJP leaders) ఆమె వ్యాఖ్యలను ఖండించారు. మొన్నటి వరకు భారత ఏజెన్సీలు, సంస్థలను కాంగ్రెస్ ద్వేషిస్తూ వచ్చిందని, ఇప్పుడు భారత క్రికెట్ జట్టును కూడా ద్వేషించడం ప్రారంభించారని బీజేపీ నేతలు మండిపడ్డారు.

అలాగే "రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలు.. షామా మొహమ్మద్ చేసిన వ్యాఖ్యలు.. వారు భారతదేశం సాధించిన విజయాలను చూసి అసూయతో ఉన్నారని నిరూపిస్తుందని షెహజాద్ పూనావాలా అన్నారు. కాగా తన వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర విమర్శలు రావడంపై షామా మొహమ్మద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఒక క్రీడాకారుల ఫిట్‌నెస్ గురించి సాధారణ ట్వీట్. ఇది బాడీ షేమింగ్ (Body shaming) కాదని.. నేను ఎప్పుడూ ఒక క్రీడాకారుడు ఫిట్‌గా ఉండాలని నమ్ముతాను. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కొంచెం బరువుగా ఉన్నాడని నేను భావించాను. అందుకే నేను దాని గురించి ట్వీట్ చేసానని వివరణ ఇచ్చింది. అయినప్పటికి భారత క్రికెట్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలు ఇలాంటి బాడీ షేమింగ్ ట్వీట్ చేయడం ఎంటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

Next Story