IPL Passes: దివ్యాంగులకు ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్ పాస్ లు.. ఇలా అప్లై చేసుకోండి

by Prasad Jukanti |

క్రికెట్ లవర్స్ కు హెచ్ సీఏ గుడ్ న్యూస్ చెప్పింది.

IPL Passes: దివ్యాంగులకు ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్ పాస్ లు.. ఇలా అప్లై చేసుకోండి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ సీజన్ -18 క్రికెట్ లవర్స్ లో జోష్ నింపుతున్న వేళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కీలక ప్రకటన చేసింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో (Rajiv Gandhi International Cricket Stadium) జరిగే ఐపీఎల్ మ్యాచ్ లను వీక్షించేందుకు దివ్యాంగులకు ఉచిత పాస్ లు (Complimentary Passes) అదించబోతున్నట్లు ప్రకటించింది. దివ్యాంగులకు కాంప్లిమెంటరీ పాస్ లను అందించడానికి తమకు సంతోషంగా ఉందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ టికెట్లు కావాల్సిన వారు ఈ మెయిల్ కు పూర్తి పేరు, కాంటాక్ట్ నెంబర్, వ్యాలిడ్ డిజబులిటీ ప్రూఫ్(స్కాన్ చేసిన కాపీ), ఏ మ్యాచ్ కోసం పాస్ కోవాలో వంటి వివరాలు [email protected] మెయిల్ కు పంపడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయని మొదట వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రాధాన్యత ఆధారంగా పాస్ లు జారీ చేస్తామని ప్రకటించింది.

Next Story