కామన్వెల్త్ గేమ్స్ పేరు మార్పు

by Gantepaka Srikanth |   (  Updated:2025-03-11 03:36:17  IST  )

నిత్యం స్పోర్ట్స్ వార్తలను ఫాలో అయ్యేవారికి కామన్వెల్త్ గేమ్స్(Commonwealth Games 2026) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కామన్వెల్త్ గేమ్స్ పేరు మార్పు
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యం స్పోర్ట్స్ వార్తలను ఫాలో అయ్యేవారికి కామన్వెల్త్ గేమ్స్(Commonwealth Games 2026) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చే ఏడాది జూలై 23 నుండి ఆగస్టు 2 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ గేమ్స్ జరుగనున్నాయి. ఇదిలా ఉండగా.. మార్చి 10న కామన్‌వెల్త్‌ డే (Commonwealth Day) ను పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ సంస్థ పేరు మార్చుకున్నది. ఇప్పటివరకూ ఉన్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌‌ను మార్చుతూ.. కామన్వెల్త్ స్పోర్ట్స్‌ మూవ్‌మెంట్‌ (Sports Movement) గా మార్చారు.

ఈ విషయాన్ని కామన్‌వెల్త్‌ స్పోర్ట్స్ సీఈవో కాటీ శాడ్లెయిర్‌ వెల్లడించారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అనేది ఇకపై కేవలం లీగల్‌ ఎంటిటీగా మాత్రమే ఉండనుందని అన్నారు. కాగా, 2026లో గ్లాస్గోలో జరగనున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు సంబంధించిన కింగ్స్‌ బాటన్‌ రిలేను కామన్‌వెల్త్‌ స్పోర్ట్ చీఫ్‌ అయిన కింగ్‌ చార్లెస్‌ ప్రారంభించారు. కామన్‌వెల్త్‌ డే సందర్భంగా బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో సోమవారం ఈ రిలే మొదలైంది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఓపెనింగ్ సంబురాలకు 500 రోజుల ముందు కింగ్స్‌ బాటన్‌ రిలేను మొదలుపెట్టారు.

Next Story