- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nitish Reddy : నితీశ్ రెడ్డికి భారీ నజరానా.. చెక్కు అందజేసిన సీఎం చంద్రబాబు
తెలుగు తేజం నితీశ్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రూ.25లక్షల చెక్కును గురువారం ఉండవల్లిలో అందజేశారు.

దిశ, స్పోర్ట్స్ : తెలుగు తేజం నితీశ్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రూ.25లక్షల చెక్కును గురువారం ఉండవల్లిలో అందజేశారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో నితీశ్ రెడ్డి అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. దీంతో నితీశ్ రెడ్డికి చంద్రబాబు నగదు ప్రోత్సహక చెక్కును అందించి కాసేపు ముచ్చటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. ‘అత్యుత్తమ ప్రతిభ కలిగిన యువ క్రికెటర్‌ను కలిశాను. తెలుగు కమ్యూనిటీలో నితీశ్ ఓ వెలుగు వెలుగుతున్నాడు. ప్రపంచ స్థాయిలో భారత దేశ సత్తాను నిరూపించాడు. అతని ప్రయాణంలో వెన్నంటి ప్రోత్సహించిన కుటుంబ సభ్యుల కృషి అభినందనీయం. రాబోయే రోజుల్లో నితీశ్ మరిన్ని సెంచరీలు చేసి విజయవంతం కావాలని కాంక్షిస్తున్నా..’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. అంతకుముందు నితీశ్ రెడ్డి తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నారు. మెట్ల మార్గం గుండా మోకాళ్లపై ఆయన కొండపైకి వెళ్లి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ తరఫున 298 పరుగులు చేసిన నితీశ్ రెడ్డి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్ మెన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.






