IPL 2025: రంగంలోకి ఆ విధ్వంసకర ఆటగాడు...RCB జెర్సీ వేసుకొని.. పంజాబ్ కు సపోర్ట్ !

by velandi.Saikiran |   (  Updated:2025-08-29 12:22:45  IST  )

ఐపీఎల్ 2025 ఫైనల్ ( ipl 2025) మ్యాచ్ ప్రారంభమైంది. పంజాబ్ కింగ్స్ (Punjab kings) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

IPL 2025: రంగంలోకి ఆ విధ్వంసకర ఆటగాడు...RCB జెర్సీ వేసుకొని.. పంజాబ్ కు సపోర్ట్ !
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 ఫైనల్ ( ipl 2025) మ్యాచ్ ప్రారంభమైంది. పంజాబ్ కింగ్స్ (Punjab kings) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB)మధ్య... ఈ బిగ్ ఫైట్ జరుగుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ( Modi Stadium)... జరుగుతున్న ఈ మ్యాచ్ లో.. మొదట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కు దిగింది. ఇలాంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ స్టేడియానికి చాలా మంది మాజీ క్రికెటర్లు, రాజకీయ నాయకులు కూడా వచ్చారు.

ఇక మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ ( Chris Gayle) కూడా ఈ మ్యాచ్ కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా... రెండు జట్లకు సపోర్ట్ చేస్తూ.. అందరికీ షాక్ ఇచ్చాడు క్రిస్ గేల్. ఈ మ్యాచ్ నేపథ్యంలో బెంగళూరు జెర్సీ ధరించిన గేల్... పంజాబ్ కింగ్స్ కు సపోర్ట్ చేస్తూ తలపాగా పెట్టాడు. సింగ్ ఈజ్ కింగ్ అన్న రేంజ్ లో.. దర్శనమిచ్చాడు గేల్. గతంలో పంజాబ్ కింగ్స్ అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు గేల్. అందుకే తనకు రెండు జట్లు సమానమంటూ చెప్పే ప్రయత్నంలో భాగంగా... గేల్ ఇలా కనిపించినట్లు తెలుస్తోంది.

Next Story