- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీడు మామూలోడు కాదు...ఒక్కడే 87 ఓవర్లు ఆడేశాడు.. చరిత్రలోనే తొలిసారి !
చట్టేశ్వర్ పూజారా మాత్రం... ఏకంగా 87 ఓవర్లు ఆడాడు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రాంచీ వేదికగా 2017 సమయంలో టెస్ట్ మ్

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ ఆటగాడు చటేశ్వర్ పూజారా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 20 సంవత్సరాల పాటు... టీమిండియా కు సేవలు అందించిన ఈ డేంజర్.. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఏజ్ పైబడడం... జట్టులో యూత్ కు ఎక్కువగా అవకాశాలు రావడంతో.. రిటైర్మెంట్ తీసుకునేందుకు పూజారా మొగ్గు చూపారు. ఈ మేరకు.. తాజాగా రిటైర్మెంట్ ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు పూజారా.
అయితే ఇలాంటి నేపథ్యంలో పూజారా కు సంబంధించిన ఓ అరుదైన రికార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక ప్లేయర్ ఈ కాలంలో ఐదు నుంచి ఆరు ఓవర్లు ఆడడం గగనం అయిపోయింది. కానీ చట్టేశ్వర్ పూజారా మాత్రం... ఏకంగా 87 ఓవర్లు ఆడాడు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రాంచీ వేదికగా 2017 సమయంలో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ పూజారా కారణంగా డ్రా అయింది.
మ్యాచ్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే... ఇందులో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 451 పరుగులు చేయగా... రెండో ఇన్నింగ్స్ లో 204 పరుగులు చేసింది. అటు ఈ మ్యాచ్ లో టీమిండియా మాత్రం ఒకే ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో 603 పరుగులు చేసిన ఇండియా 9 వికెట్లు నష్టపోయి డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్ లోనే పూజారా 525 బంతుల్లో 202 పరుగులు చేశాడు. ఇందులో 21 బౌండరీలు ఉన్నాయి. అంటే దాదాపు 87 ఓవర్లు ఒక్కడే ఆడేశాడు. ఇలా ఆడడం పూజారా చరిత్రలోనే తొలిసారి.






