- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : నార్వేలోని ఓస్లోలో జరుగుతున్న నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద సంచలన విజయం సాధించాడు. వరల్డ్ నం.1 మాగ్నస్ కార్ల్‌సెన్(నార్వే)ను ఓడించాడు. 2024లో ఇదే టోర్నీలో కార్ల్‌సెన్‌పై ప్రజ్ఞానంద తొలిసారిగా పైచేయి సాధించి అబ్బురపరిచాడు. ఇప్పుడు మరోసారి అతనికి షాకిచ్చాడు. బుధవారం రాత్రి జరిగిన 3వ రౌండ్‌లో కార్ల్‌సెన్‌పై 46 ఎత్తుల్లో గెలుపొందాడు. సుదీర్ఘంగా సాగిన గేమును ప్రజ్ఞానంద చాలా సేపు మ్యాచ్‌ను నియంత్రణలో ఉంచుకున్నాడు. కానీ, ఓ దశలో కార్ల్‌సెన్ పుంజుకున్నా అతను చేసిన తప్పిదం కారణంగా ఓటమిని చవిచూశాడు. మరోవైపు, మూడో రౌండ్‌ను వరల్డ్ చాంపియన్ గుకేశ్ దొమ్మరాజు డ్రా చేసుకున్నాడు. ఫ్రాన్స్‌కు చెందిన అలిరెజా ఫిరౌజాతో పాయింట్స్ పంచుకున్నాడు. దీంతో ఆ రౌండ్ ఆర్మగెడాన్‌కు వెళ్లగా అక్కడ ఫిరౌజా గెలిచాడు. ప్రస్తుతం ఫిరౌజా 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ప్రజ్ఞానంద 4.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. కార్ల్‌సెన్(1.5 పాయింట్స్) ఆఖరి స్థానంలో ఉండటం గమనార్హం.






