- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో ప్రతిష్టాత్మక టోర్నీకి భారత్ ఆతిథ్యం
ఈ ఏడాది ఫిడే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వబోతోంది.

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది ప్రతిష్టాత్మక పురుషుల ఫిడే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వబోతోంది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్(ఫిడే) సోమవారం ప్రకటించింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు చెస్ ప్రపంచకప్ భారత్‌లో జరగనున్నట్టు తెలిపింది. ఈ టోర్నీలో టాప్-3లో నిలిచిన ప్లేయర్లు వచ్చే ఏడాది జరగబోయే ఫిడే క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తారు. ఆ టైటిల్ విన్నర్ ప్రస్తుతం వరల్డ్ చాంపియన్ డి.గుకేశ్‌తో వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్-2026లో తలపడతాడు. వరల్డ్ కప్‌లో 206 మంది ప్లేయర్లు పాల్గొంటారు. ఈ టోర్నీ నాకౌట్ ఫార్మాట్‌లో జరుగుతుంది. 8 నాకౌట్ రౌండ్లలో ప్లేయర్లు పోటీపడతారు. ప్రతి రౌండ్‌లో ఓడిపోయిన ప్లేయర్లు ఎలిమినేట్ అవుతారు. ఇటీవల కాలంలో భారత్ మేజర్ చెస్ ఈవెంట్లు జరిగాయి. 2022లో చెస్ ఒలింపియాడ్, గతేడాది టాటా స్టీల్ చెస్, వరల్డ్ జూనియర్ అండర్-20 చాంపియన్‌షిప్ భారత్‌లో నిర్వహించగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో మహిళల గ్రాండ్ ప్రిక్స్ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది.






