- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ధోనీ ధనాధన్... చెన్నై గ్రాండ్ విక్టరీ

* భారీ విజయాన్ని నమోదు చేసిన చెన్నై
* 5 వికెట్ల తేడాతో లక్నో ను చిత్తు చేసిన ధోని సేన
* ధోని భయంకరమైన ఇన్నింగ్స్
* చెన్నైకి ప్లే ఆఫ్ ఆశలు సజీవం
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో చెన్నై సూపర్ కింగ్స్ బౌన్స్ బ్యాక్ అయింది. ధోని కెప్టెన్సీలో... ఈ మెగా టోర్నమెంట్ లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. గత కొన్ని మ్యాచ్ లలో దారుణంగా విఫలమవుతున్న చెన్నై... లక్నో తో జరిగిన మ్యాచ్ లో మాత్రం గాడిలో పడింది. సోమవారం జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై ఏకంగా ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ధోని సేన. చివరి వరకు మహేంద్ర సింగ్ ధోని, దూబే క్రీజులో ఉండి చెన్నై సూపర్ కింగ్స్ కు విజయాన్ని అందించారు. మరోసారి మహేంద్ర సింగ్ ధోని ఫినిషింగ్ రోల్ తీసుకొని జట్టుకు ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచాడు. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ ఏమి చేయలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి.. కేవలం 166 పరుగులు మాత్రమే చేసింది. అయితే లక్నో విధించిన 167 పరుగుల లక్ష్యాన్ని... కష్టపడి ఛేదించింది చెన్నై సూపర్ కింగ్స్. కేవలం 19.3 ఓవర్లలో 5 వికెట్స్ నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించి చెన్నై గెలిచింది.
అదిరిపోయిన ధోని రివ్యూ సిస్టం
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కొత్తగా మరోసారి కెప్టెన్ గా నియామకమైన మహేంద్రసింగ్ ధోని... అద్భుతంగా రాణిస్తున్నాడు. తన అనుభవాన్ని.. లక్నో మ్యాచ్ లో చూపించాడు ధోని. ముఖ్యంగా DRS ను కాస్త ధోని రివ్యూ సిస్టం గా మార్చుకున్న మహేంద్రసింగ్ ధోని... లక్నో డేంజర్ ఆటగాడు పూరన్ ను పెవిలియన్ కు తొందరగానే పంపాడు. సరైన సమయంలో రివ్యూ తీసుకొని... అతని ఔట్ చేశాడు. అదే సమయంలో కీపింగ్ కూడా అద్భుతంగా చేశాడు ధోని. డేంజర్ గా మారుతున్న అబ్దుల్ సమద్ ను రనౌట్ చేశాడు. అటు 63 పరుగులు చేసిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ క్యాచ్ కూడా పట్టాడు.
ఫామ్ లోకి వచ్చిన పంత్
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ ఏమి చేయలేదు. లక్నో ఇన్నింగ్స్ లో... కెప్టెన్ రిషబ్ పంత్ ఒక్కడే దుమ్ము లేపాడు. గత మ్యాచ్ లలో దారుణంగా విఫలమైన రిషబ్ పంత్... చెన్నై తో జరిగిన మ్యాచ్ లో మాత్రం రఫ్పాడించాడు. ఈ టోర్నమెంట్ లో మొదటి హాఫ్ సెంచరీ చేసిన రిషబ్ పంత్... 49 బంతుల్లోని 63 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు నాలుగు బౌండరీలు ఉన్నాయి. 128 స్ట్రైక్ రేట్ తో దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు పంత్. అలాగే లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ 25 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లతో పాటు రెండు బౌండరీలు ఉన్నాయి. ఆయుష్ బదోని 22 పరుగులు చేయగా... అబ్దుల్ సమద్ 11 బంతుల్లో 20 పరుగులు చేశాడు. గత మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన మార్కరం ఆరు పరుగులు చేయగా... పూరన్ కేవలం ఎనిమిది పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ ఇద్దరు ప్లేయర్లను ధోని తన కెప్టెన్సీ చాతుర్యంతో తొందరగా పెవిలియన్ కు పంపాడు.