- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తేలిపోయిన చెన్నై.. ముంబై టార్గెట్ ఎంతంటే ?
ఐపీఎల్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ బిగ్ ఫైట్ జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ ( CSK) వర్సెస్ ముంబై ఇండియన

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ బిగ్ ఫైట్ జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ ( CSK) వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) మధ్య... కీలక మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో... తేలిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు... నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసింది. ఇది ఇలా ఉండగా... ఈ మ్యాచ్ లో చెన్నై ప్లేయర్లలో ఒక్కరు కూడా పెద్దగా రాణించలేదు. కేవలం శివం దూబే అలాగే రవీంద్ర జడేజా ఇద్దరు అద్భుతంగా రాణించారు. షేక్ రషీద్ 20 బంతుల్లో 19 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్ర 9 బంతుల్లో ఐదు పరుగులు మాత్రమే చేశాడు.
ఆయుష్ మాత్రే 15 బంతుల్లో 32 పరుగులతో దుమ్ము లేపాడు. శివం దూబే.. 32 బంతుల 50 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు రెండు బౌండరీలు ఉన్నాయి. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 35 బంతుల 53 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. తన ఇన్నింగ్స్ లో రెండు సిక్సర్లతో పాటు నాలుగు బౌండరీలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ నిర్ణిత 20 ఓవర్ల లో 177 పరుగులు చేయాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా... ముంబై ఇండియన్స్ బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ బుమ్రా అదరగొట్టాడు. నిర్ణీత నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు తీసిన బుమ్రా 25 పరుగులు ఇచ్చాడు. అశ్విని కుమార్ రెండు ఓవర్లు వేసి 42 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ కూడా పడగొట్టాడు. దీపక్ చాహర్ 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. సంట్నర్ కు కూడా ఒక వికెట్ పడింది.






