- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గైక్వాడ్ ఒంటరి పోరాటం.. గుజరాత్ టార్గెట్ ఇదే?
గైక్వాడ్ (74) ఒంటరి పోరాటంతో చెన్నై 158 పరుగులు చేసింది. గుజరాత్ విజయం సాధించాలంటే 159 పరుగులు చేయాలి. ఈ ఉత్కంఠ పోరులో గెలుపెవరిదో?

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో రివేంజ్ వీక్ లో భాగంగా చెన్నై, గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో కెప్టెన్ గైక్వాడ్ (Captain Gaikwad) ఒంటరి పోరాటం చేశాడు. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై బ్యాటర్లు వెంట వెంటనే పెవిలియన్ కు చేరుకున్నారు. దీంతో ఈ సీజన్ లో పవన్ ప్లేలో అత్యల్ప స్కోరును చెన్నై నమోదు చేసింది. వచ్చిన వారు వచ్చినట్లే అవుట్ అవుతున్నప్పటికి ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ గైక్వాడ్ మాత్రం స్థిరంగా క్రీజులో ఉండిపోయాడు.
20 ఓవర్ల పాటు ఆడిన గైక్వాడ్ 60 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్లతో 74 పరుగులు చేశాడు. అలాగే శివమ్ దుబే 22, ఓవర్టన్ 18 పరుగులతో చెన్నైకి తోడుగా నిలిచారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచులో గుజరాత్ విజయం సాధించాలంటే 120 బంతుల్లో 159 పరుగులు చేయాల్సి ఉంది. మరి ఈ మ్యాచులో గుజరాత్ సునాయాస విజయం సాధిస్తుందా లేదా తెలియాలంటే చివరి వరకు వేచి చూడాల్సిందే.






