- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CSK vs PBKS : ముగిసిన చెన్నై బ్యాటింగ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్ 2025(IPL 2025) లో భాగంగా నేడు జరుగుతున్న సీఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్(CSK vs PBKS) మ్యాచ్ లో చెన్నై 190 పరుగులు చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) లో భాగంగా నేడు జరుగుతున్న సీఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్(CSK vs PBKS) మ్యాచ్ లో చెన్నై 190 పరుగులు చేసింది. చిదంబరం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై 19.2 ఓవర్లకే 190 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. సామ్ కరణ్(Sam Karan) (88), బ్రెవిస్ (32) పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో చాహాల్(Chahal) ఒకే ఓవర్లో వరుస 4 వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. అర్షదీప్, జాన్సన్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇంపాక్ట్ ప్లేయర్లుగా బరిలోకి దిగిన అన్షుల్, నూర్ అహ్మద్ డక్ ఔట్ కాగా, కెప్టెన్ ధోనీ కూడా విఫలం అయ్యాడు. ఇక ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన అనంతరం చాహాల్ గ్రౌండ్స్ లోనే సంబరాలు చేసుకున్నాడు. వరుస 3 బాల్స్ లో 3 వికెట్లు తీయడం గమనార్హం.
ఇక 191 పరుగుల లక్ష్యంలో పంజాబ్ కింగ్స్ జట్టు మరికొద్దిసేపట్లో బరిలోకి దిగనుంది. కాగా ఈ మ్యాచ్ ఫలితం చెన్నై భవితవ్యాన్ని నిర్ణయించనుంది. ఓడితే సీఎస్కే ఇంటిదారి పట్టడం ఖాయం అంటున్నారు క్రీడా నిపుణులు.






