RR vs CSK : ముగిసిన చెన్నై బ్యాటింగ్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్

by Muthe.Rajitha |   (  Updated:2025-05-20 16:11:04  IST  )

ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు రాజస్తాన్, చెన్నై(RR vs CSK) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.

RR vs CSK : ముగిసిన చెన్నై బ్యాటింగ్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు రాజస్తాన్, చెన్నై(RR vs CSK) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సీఎస్కే బ్యాటర్లు రెచ్చిపోవడంతో ఆ జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. బ్రెవిస్ (42), మాత్రే (43), శివమ్ దూబే (39) పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.

అయితే తొలి 7 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన చెన్నైని బ్రెవిస్, దూబే ఆదుకున్నారు. ఇక రాజస్తాన్ బౌలర్స్ లో యుధ్వీర్ సింగ్ 3, మధ్వాల్ 3, హాసరంగ 2 వికెట్లు తీశారు. 188 పరుగుల భారీ లక్ష్యంతో రాజస్తాన్ బరిలోకి దిగనుంది.

Next Story