- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెఫ్ గా మారిన సచిన్ టెండూల్కర్..క్యూట్ వీడియో వైరల్
సచిన్ టెండూల్కర్ చెఫ్ గా మారిన వీడియో వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నతనంలోనే భారత జట్టులో స్థానం సంపాదించుకున్న సచిన్ టెండూల్కర్, టన్నుల కొద్దీ పరుగులు చేశారు. ఎన్నో రికార్డులు కొల్లగొట్టారు. భారత జట్టుకు కూడా ఎన్నో విజయాలు అందించిన క్రికెట్ దేవుడిగా సచిన్ టెండూల్కర్ కు పేరు ఉంది. అలాంటి సచిన్ టెండూల్కర్ తాజాగా చెఫ్ గా మారిపోయారు. కిచెన్ లో వంట చేస్తూ అభిమానులను అలరించారు.
సాంప్రదాయ మరాఠీ శైలిలో స్వయంగా సచిన్ టెండూల్కర్.. ఆవిరి కుడుములు (UkdicheModak) తయారు చేశారు. ఆ తర్వాత తన అమ్మగారికి తినిపించారు. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా సచిన్ పంచుకున్నారు. దీంతో క్షణాల్లో వీడియో వైరల్ గా మారింది. దీనిపై క్రికెట్ అభిమానులు స్పందిస్తున్నారు. బ్యాటింగ్ లోనే కాదు.. వంట చేయడంలో కూడా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అదరగొడుతున్నాడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.






