IND VS SL : శ్రీలంక టీ20 కెప్టెన్‌గా అసలంక.. భారత్‌తో టీ20 సిరీస్‌కు జట్టు ఎంపిక

by Harish |

శ్రీలంక టీ20 కెప్టెన్‌గా చరిత్ అసలంక నియామకమయ్యాడు.

IND VS SL : శ్రీలంక టీ20 కెప్టెన్‌గా అసలంక.. భారత్‌తో టీ20 సిరీస్‌కు జట్టు ఎంపిక
X

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక టీ20 కెప్టెన్‌గా చరిత్ అసలంక నియామకమయ్యాడు. టీ20 వరల్డ్ కప్‌లో జట్టు పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ వానిందు హసరంగ టీ20 సారథిగా తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌కు శ్రీలంక క్రికెట్ బోర్డు బ్యాటర్ అసలంకను కెప్టెన్‌గా నియమించింది. మంగళవారం తమ జట్టును ప్రకటించింది.

టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక గ్రూపు దశలోనే ఇంటిదారిపట్టింది. ఈ నేపథ్యంలో లంక బోర్డు టీ20 జట్టులో మార్పులు చేసింది. సీనియర్లు ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డె సిల్వ, సమరవిక్రమ, దిల్షాన్ మధుశంకలను పక్కనపెట్టింది. దినేశ్ చండీమాల్, కుసాల్ పెరీరా తిరిగి జట్టులోకి వచ్చారు. అలాగే, అన్‌క్యాప్డ్ ప్లేయర్ విక్రమసింఘే, బినురా ఫెర్నాండో, అవిష్క ఫెర్నాండో చోటు సంపాదించారు. టీ20 సిరీస్‌లో భాగంగా ఈ నెల 27న తొలి మ్యాచ్ జరగనుంది.

శ్రీలంక టీ20 జట్టు : చరిత్ అసలంక(కెప్టెన్), నిశాంక, కుసాల్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుసాల్ మెండిస్, దినేశ్ చండీమాల్, కామిందు మెండిస్, షనక, హసరంగ, దునిత్ వెల్లిలాగే, తీక్షణ, విక్రమసింఘే, పతిరణ, నువాన్ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో.

Next Story