- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చాలా బాధతో చెబుతున్నా.. ఆ ముగ్గురికి చాంపియన్స్ ట్రోఫే ఆఖరిది.. మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు
గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్, కోహ్లీ, జడేజా టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : భారత సీనియర్ ప్లేయర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలకు చాంపియన్స్ ట్రోఫీనే చివరి ఐసీసీ టోర్నీ అని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్, కోహ్లీ, జడేజా టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఈ ముగ్గురి వన్డేలకు గుడ్ బై చెబుతారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ‘బాధతో నిండిన హృదయం చెబుతున్నా. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత వారు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ టోర్నీ తర్వాత మరో ఐసీసీ ఈవెంట్ అంటే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఉంది. కానీ మనం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించలేదు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగనుంది. కానీ, ఆ ముగ్గురు పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. కాబట్టి, అది కూడా వాళ్లు ఆడలేరు. ఇక, వన్డే వరల్డ్ కప్-2027 చాలా దూరంలో ఉంది. అప్పటి వరకు ఏం జరుగుతుందో తెలియదు. వారు కూడా చాంపియన్స్ ట్రోఫీనే తమ చివరి ఐసీసీ ఈవెంట్ అని భావిస్తున్నారని అనుకుంటున్నా.’ అని చెప్పుకొచ్చాడు.






