ఛాంపియన్స్ ట్రోఫీ.. దుబాయ్ చేరుకున్న భారత జట్టు(వీడియో)

by Yella Dhawani Reddy |   (  Updated:2025-02-16 06:05:58  IST  )

ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతున్న ప్రతిష్టాత్మక ఐసీసీ (ICC) టోర్నీకి సమయం ఆసన్నమైంది.

ఛాంపియన్స్ ట్రోఫీ.. దుబాయ్ చేరుకున్న భారత జట్టు(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతున్న ప్రతిష్టాత్మక ఐసీసీ (ICC) టోర్నీకి సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో దుబాయ్ వేదికగా ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుండగా.. టీమిండియా ఆడే మ్యాచ్‌లను మాత్రం దుబాయ్‌లో నిర్వహించేలా ఐసీసీ షెడ్యూల్ రూపొందించింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు శనివారం రాత్రి దుబాయ్ చేరుకున్నారు. వారికి దుబాయ్ లో ఘన స్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేయగా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇక ఫిబ్రవరి 20న భారత్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ ఈనెల 23న జరుగనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టు ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.

Next Story