- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Champions Trophy : చాంపియన్స్ ట్రోఫీ ముంగిట టీమిండియాకు షాక్ !
చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)కి ముందు భారత్ క్రికెట్ జట్టు(Indian cricket team)కు అనూహ్యమైన ఎదురుదెబ్బ తగిలింది

దిశ, వెబ్ డెస్క్ : చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)కి ముందు భారత్ క్రికెట్ జట్టు(Indian cricket team)కు అనూహ్యమైన ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్(Bowling coach Morne Morkel)ఆకస్మాత్తుగా తన స్వదేశానికి వెళ్లా(He went Home)డు. దుబాయ్ నుంచి అతను . దక్షిణాఫ్రికాకు వెళ్లిపోయాడు. మోర్కెల్ తండ్రి మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అతను స్వదేశానికి వెళ్లినట్లుగా సమాచారం. టీమ్ ప్రాక్టీస్ సెషన్ లో కూడా అతను కనిపించలేదు.
మోర్కల్ మళ్లీ ఎప్పుడు జట్టుతో కలుస్తాడన్న ఇంకా స్పష్టమైన సమాచారం తెలియరాలేదు. అసలే ప్రధాన పేసర్ జస్పిత్ బూమ్రా జట్టులో లేకపోవడం..ఇప్పుడు బౌలింగ్ కోచ్ మోర్కెల్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రభావం చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుపై పడే అవకాశాలు లేకపోలేదంటున్నారు క్రీడా విశ్లేషకులు. చాంపియన్స్ ట్రోఫీలో ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్‌తో ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. మూడు వారాలు పాటు కొనసాగే చాంపియన్స్ ట్రోఫీ శనివారం నుంచి ప్రారంభం కానుంది. కరాచీలో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ ఉంటుంది.
ట్రోఫీ కోసం మొత్తం 8 జట్లు పోటీపడుతున్నాయి. ఇండియా తన మ్యాచ్ లు దుబాయ్‌లో ఆడనుండగా, మిగితా జట్లు పాక్ వేదికల్లో ఆడనున్నాయి. 8 ఏళ్ల తర్వాత సుధీర్ఘ విరామం అనంతరం తిరగి చాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ నిర్వహిస్తుంది. 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ గెలుచుకుంది.






