Champions Trophy: పీకల్లోతు కష్టాల్లో ఆఫ్ఘనిస్తాన్.. సౌతాఫ్రికా విక్టరీ ఖాయమా?

by Gantepaka Srikanth |

ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో భాగంగా పాకిస్తాన్‌(Pakistan)లోని కరాచీ(Karachi) వేదిగా జరుగుతోన్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు.

Champions Trophy: పీకల్లోతు కష్టాల్లో ఆఫ్ఘనిస్తాన్.. సౌతాఫ్రికా విక్టరీ ఖాయమా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో భాగంగా పాకిస్తాన్‌(Pakistan)లోని కరాచీ(Karachi) వేదిగా జరుగుతోన్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు. 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేశారు. 316 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్(Afghanistan).. ఆదిలోనే చేతులెత్తేసింది. ఓపెనర్లు గుర్బాజ్(10), ఇబ్రహీం(17), అటల్(16), షాహిదీ(0), ఒమర్‌జాయ్(18), నబీ(8) పరుగులకే పెవీలియర్ చేరారు. ప్రస్తుతం క్రీజులో రహ్మత్ షా(44), నయిబ్(0) ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించాలంటే 190 పైచిలుకు పరుగుల చేయాలి. ఎంతవరకు రాణిస్తారో చూడాలి.

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సౌతాఫ్రికా(South Africa) అద్భుతంగా రాణించింది. ఆఫ్ఘనిస్తాన్ ముందు నుంచి ఆధిపత్యం చూపించారు. ఎక్కడా అవకాశం ఇవ్వకుండా అదరగొట్టారు. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(103) సెంచరీతో పాటు కెప్టెన్ బవుమా(58), రాస్సీ వాన్ డెర్ డస్సెన్(52), ఐడెన్ మార్క్రామ్(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Next Story