- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లైన మూడు నెలలకే అలాంటి పనులు.. మాజీ భార్య కామెంట్స్ పై చాహల్ ఘాటు వ్యాఖ్యలు
తన భర్త టీమిండియా క్రికెటర్ చాహల్ పెళ్లైన రెండు నెలలకే మోసం చేశాడు అంటూ ధన శ్రీ ఓ షోలో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలపై తాజాగా స్పందించిన చాహల్ ఖండించాడు. కేవలం ఫేమస్ అవ్వడానికే తన పేరును ధనశ్రీ వాడుకుంటుందని అన్నాడు.

దిశ, వెబ్ డెస్క్: తన భర్త టీమిండియా క్రికెటర్ చాహల్ పెళ్లైన రెండు నెలలకే మోసం చేశాడు అంటూ ధన శ్రీ ఓ షోలో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలపై తాజాగా స్పందించిన చాహల్ ఖండించాడు. కేవలం ఫేమస్ అవ్వడానికే తన పేరును ధనశ్రీ వాడుకుంటుందని అన్నాడు. తన వరకు ఆ అధ్యయం ముగిసిపోందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను క్రిడాకారుడిని అని మోసం చేసే అలవాటు లేదన్నాడు. పెళ్లైన రెండు నెలలకే చీటింగ్ చేస్తే ఇన్నేళ్లపాటు రిలేషన్ షిప్ ఎలా కొనసాగుతుందని ప్రశ్నించాడు.
తన జీవితంలో ఆ చాప్టర్ క్లోజ్ అయ్యిందని, ముందుకు సాగిపోయానని స్పష్టం చేశాడు. అందరూ అదే చేస్తే మంచిది అంటూ తన మాజీ భార్యకు హితవు పలికాడు. అక్కడితో ఆగకుండా ఇప్పటికే నా పేరు మీదనే వాళ్ల ఇల్లు గడుస్తోంది అంటూ వ్యాఖ్యానించాడు. వాళ్లు అలాగే కొనసాగించవచ్చు కానీ నేను పట్టించుకోను నాకు ఎలాంటి ఎఫెక్ట్ లేదని అన్నారు. సోషల్ మీడియాలో వంద విషయాలు ప్రచారం అవుతాయని కానీ నిజం ఒక్కటే ఉంటుందని అన్నాడు. ప్రస్తుతం తన జీవితం, ఆటపైనే పూర్తి దృష్టి పెట్టానని స్పష్టం చేశాడు.






