Wimbledon 2025 : వింబుల్డన్‌కు నయా చాంపియన్.. అల్కరాజ్‌కు షాకిచ్చి టైటిల్ ఎగరేసుకుపోయిన సిన్నర్

by Harish |

వరల్డ్ నం.1 టెన్నిస్ ప్లేయర్ జెన్నిక్ సిన్నర్(ఇటలీ) వింబుల్డన్‌కు నయా చాంపియన్‌గా అవతరించాడు.

Wimbledon 2025 : వింబుల్డన్‌కు నయా చాంపియన్.. అల్కరాజ్‌కు షాకిచ్చి టైటిల్ ఎగరేసుకుపోయిన సిన్నర్
X

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ నం.1 టెన్నిస్ ప్లేయర్ జెన్నిక్ సిన్నర్(ఇటలీ) వింబుల్డన్‌కు నయా చాంపియన్‌గా అవతరించాడు. తొలిసారిగా మెన్స్ సింగిల్స్ టైటిల్ ఎగరేసుకపోయాడు. ఫైనల్‌కు చేరుకున్న తొలిసారే విజేతగా నిలవడం విశేషం. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో అతను డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్(స్పెయిన్‌)ను మట్టికరిపించాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో సిన్నర్ 4-6, 6-4, 6-4, 6-4 తేడాతో విజయం సాధించాడు. అల్కరాజ్‌ను నిలువరించడానికి సిన్నర్ శక్తికి మించి పోరాడాడు. మ్యాచ్ ఆరంభంలోనే అతనికి షాక్ తగిలింది. తొలి సెట్‌ను అల్కరాజే నెగ్గాడు. ఆ తర్వాత పుంజుకున్న సిన్నర్ వరుసగా మూడు సెట్లు గెలిచాడు. అయితే మూడు సెట్లలోనూ అల్కరాజ్ నుంచి తీవ్ర పోటీ తప్పలేదు. కానీ, సిన్నర్ పట్టు వదల్లేదు. అల్కరాజ్‌ను ఒత్తిడిలోకి నెట్టి తప్పులు చేసేలా చేశాడు. దీంతో సిన్నర్ మూడు సెట్లు నెగ్గడంతో టైటిల్ కైవసమైంది. దీంతో వింబుల్డన్ టైటిల్ గెలిచిన తొలి ఇటలీ ప్లేయర్‌గా సిన్నర్ రికార్డుకెక్కాడు. మరోవైపు, హ్యాట్రిక్ టైటిల్ గెలవాలని చూసిన అల్కరాజ్‌కు నిరాశ తప్పలేదు. సిన్నర్‌కు ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఈ ఏడాది రెండోది. సీజన్ ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచాడు. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించాడు.


Next Story