- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Temba Bavuma: బుడ్డోడు అన్నారు కదరా...మనోడి ఎంట్రీ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే
టెంబా బవుమా ( Temba Bavuma) ... ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే... ఎక్కడ చూసినా అతని ఫోటోలు, వీడియోలు మాత్రమే

దిశ, వెబ్ డెస్క్: టెంబా బవుమా ( Temba Bavuma) ... ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే... ఎక్కడ చూసినా అతని ఫోటోలు, వీడియోలు మాత్రమే వస్తున్నాయి. అదే సమయంలో టెంబా బవుమా సాధించిన రికార్డుల గురించి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దీనికి కారణం... వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఛాంపియన్ గా దక్షిణాఫ్రికా జట్టును ( South Africa) నిలపడమే. టెంబా బవుమా కెప్టెన్సీలో... 27 సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ గెలిచింది దక్షిణాఫ్రికా.
గత వారంలో.. లండన్ లోని లార్డ్స్ వేదికగా ( Lord's in London) దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా ( AUSTRALIA ) మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ( World Test Championship Final ) జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన దక్షిణాఫ్రికా టీం... ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది సౌత్ ఆఫ్రికా. అయితే ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించడం వెనుక కెప్టెన్ టెంబా బవుమా కృషి కచ్చితంగా ఉంది.
టెంబా బవుమా వల్లే ఇది సాధ్యమైంది. ఈ నేపథ్యంలోనే... ప్రపంచ వ్యాప్తంగా అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే తాజాగా టెంబా బవుమా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ పట్టుకొని ఫోటోలు దిగాడు టెంబా బవుమా. నార్మల్ వైట్ జెర్సీలో కాకుండా.. ఫార్మల్ డ్రెస్ లో... కనిపించడమే కాకుండా... బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని రచ్చ లేపాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వీటిని చూసిన... క్రికెట్ అభిమానులు తెగ కామెంట్స్ పెడుతున్నారు. హాలీవుడ్ హీరో రేంజ్ లో టెంబా బవుమా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
TWITTER LINK
CAPTAIN TEMBA BAVUMA WITH WTC TROPHY. 🥶
— Tanuj (@ImTanujSingh) June 17, 2025
- The Aura of Captain Temba..!!!! pic.twitter.com/VbamnksTd5






