- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత ప్లేయర్లకు వరుస గాయాలు.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
భారత్–ఆస్ట్రేలియా మధ్య బుధవారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. వన్డే సిరీల్ ను చేజార్చుకున్న భారత జట్టు టీ20పై పట్టు సాధించేందుకు చాలా రోజులుగా ప్రాక్టీస్ చేస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: భారత్–ఆస్ట్రేలియా మధ్య బుధవారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. వన్డే సిరీల్ ను చేజార్చుకున్న భారత జట్టు టీ20పై పట్టు సాధించేందుకు చాలా రోజులుగా ప్రాక్టీస్ చేస్తుంది. అయితే రేపటి నుంచి ఈ టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా ఈ రోజు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యంపై సానుకూల సమాచారం అందించారు. సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో అలెక్స్ కేరీ క్యాచ్ పట్టే క్రమంలో అయ్యర్ మోకాలికి, ఎడమ వైపు పక్కటెముకలకు గాయమై తీవ్ర నొప్పితో మైదానం వీడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సూర్య మాట్లాడుతూ.. “అయ్యర్ స్థితి బాగానే ఉంది. వైద్యులు, బీసీసీఐ పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. ఆయన మాట్లాడుతున్నారు.. మెసేజ్‌లకు రిప్లై ఇస్తున్నారు. ఇది మంచి సూచన.
దేవుడి దయతో త్వరలోనే కోలుకుంటారు” అని చెప్పారు. అలాగే, “ఇలాంటి సంఘటనలు చాలా అరుదు. అయితే, శ్రేయాస్ లాంటి ప్రతిభావంతుడికి ఇది తాత్కాలిక ఇబ్బంది మాత్రమే” అని సూర్యకుమార్ తెలిపారు. అదే సమయంలో యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గాయంపై కూడా సూర్యకుమార్ వివరించారు. రెండో వన్డేలో ఎడమ తొడ గాయంతో నితీష్ మూడో మ్యాచ్ నుంచి తప్పుకున్నప్పటికీ, ఇప్పుడు నితీష్ ప్రాక్టీస్ ప్రారంభించాడని తెలిపారు. “నిన్న రన్నింగ్ చేశాడు, నెట్ ప్రాక్టీస్ చేశాడు. ఈ రోజు ఆప్షనల్ ప్రాక్టీస్ ఉన్నా కూడా జట్టుతో కలిసే ఉండటానికి గ్రౌండ్‌కు వచ్చాడు. అతను కూడా బాగానే ఉన్నాడు” అని ఈ సందర్బంగా యాదవ్ పేర్కొన్నారు. ఇక రోహిత్ శర్మ టీ20లకు వీడ్కోలు చెప్పిన తర్వాత సూర్యకుమార్ నాయకత్వంలో భారత్ కొత్త యుగాన్ని ప్రారంభిస్తోంది. ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.






