గిల్ ట్రిపుల్ సెంచరీ మిస్... 600కు చేరువలో టీమిండియా స్కోర్

by velandi.Saikiran |   (  Updated:2025-07-03 15:36:41  IST  )

టీమిండియా కెప్టెన్ గిల్ కు తీవ్ర నిరాశ ఎదురయింది. ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో... ట్రిప

గిల్ ట్రిపుల్ సెంచరీ మిస్... 600కు చేరువలో టీమిండియా స్కోర్
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా కెప్టెన్ గిల్ కు తీవ్ర నిరాశ ఎదురయింది. ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో... ట్రిపుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. నిన్న సెంచరీ చేసిన గిల్... ఇవాళ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.. డబుల్ సెంచరీ అయిన తర్వాత... చాలా వేగంగా బ్యాటింగ్ చేశాడు గిల్. ఈ నేపథ్యంలోనే 300 పరుగులు సాధిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ 269 పరుగులు చేసి టంగు బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు గిల్.

ఈ నేపథ్యంలోనే... ఇంగ్లాండ్ గడ్డపై ట్రిపుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక తన 269 పరుగులలో... 30 బౌండరీలు అలాగే మూడు సిక్సర్లు ఉన్నాయి. దాదాపు రెండు రోజులపాటు గిల్ బ్యాటింగ్ చేసి ఔట్ అయ్యాడు. ట్రిపుల్ సెంచరీ చేసి ఉంటే... బాగుండేదని.. అనవసరంగా గిల్ అవుట్ అయ్యాడని అతని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. టీమిండియా యంగ్ కెప్టెన్ గిల్... అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అవుట్ అయిన నేపథ్యంలో.... ఇంగ్లాండ్ ప్లేయర్లతో పాటు అభిమానులు కూడా... లేచి చప్పట్లు కొట్టారు. గ్రేట్ ఇన్నింగ్స్ అంటూ... గిల్ ను మెచ్చుకుంటున్నారు.

Next Story