- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీమిండియాకు గుడ్ న్యూస్..బ్యాటింగ్ ఇరగదీసిన అభిషేక్ , పాండ్యా
అభిషేక్ శర్మ, ఇవాళ అర్థ సెంచరీతో రెచ్చిపోయాడు. కేవలం 18 బంతుల్లోనే 5 బౌండరీలు, నాలుగు సిక్సర్ల

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా డేంజర్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, హర్ధిక్ పాండ్యా సంచలన బ్యాటింగ్ చేశారు. మొన్ననే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో సెంచరీ సాధించిన అభిషేక్ శర్మ, ఇవాళ అర్థ సెంచరీతో రెచ్చిపోయాడు. కేవలం 18 బంతుల్లోనే 5 బౌండరీలు, నాలుగు సిక్సర్ల సహాయంతో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బరోడా జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ ఈ ఘనత సాధించాడు. అభిషేక్ శర్మతో పాటు అన్మోల్‌ప్రీత్ సింగ్ 69 పరుగులు చేసి దుమ్ములేపాడు. నమన్ ధీర్
కూడా 39 పరుగులతో రఫ్పాడించాడు. ఈ ముగ్గురు కీలక ప్లేయర్లు మెరవడంతో నిర్ణయిత 20వ ఓవర్లలో పంజాబ్ జట్టు, ఎనిమిది వికెట్ల నష్టానికి 222 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని బరోడా జట్టు అవలీలగా ఛేదించింది. 19.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయిన బరోడా 224 పరుగులు సాధించి, గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో 7 వికెట్ల తేడాతో బరోడా విజయం సాధించింది.
విష్ణు సోలంకి 43 పరుగులు సాధించగా, శివాలిక్ శర్మ 47 పరుగులతో రెచ్చిపోయాడు. ఇక చివరిలో హార్దిక్ పాండ్యా 42 బంతుల్లో 77 పరుగులతో రఫ్ఫాడించాడు. ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు ఏడు బౌండరీలు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత టి20 క్రికెట్ లో అడుగుపెట్టిన హార్దిక్ పాండ్యా ఈ రేంజ్ లో విజృంభించడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. మొత్తానికి పంజాబ్ జట్టు కెప్టెన్ అభిషేక్ శర్మ ఇటు హార్దిక్ పాండ్యా ఇద్దరు మంచి ఫామ్ కనబరచడం టీమిండియాకు కలిసి రానుంది. వీళ్ళిద్దరూ ఇలాగే భయంకరంగా ఆడితే, దక్షిణాఫ్రికాపై టి20 సిరీస్ అవలీలగా గెలిచే ఛాన్సులు ఉన్నాయి.






