ఆ టీమ్‌తో జాగ్రత్తగా ఉండాలంటూ టీమిండియాకు సునీల్ గవాస్కర్ హెచ్చరిక

by Harish |

ఆ టీమ్‌తో జాగ్రత్తగా ఉండాలంటూ టీమిండియాకు సునీల్ గవాస్కర్ హెచ్చరిక
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్ భారత్‌కు డూ ఆర్ డై లాంటిది. ఆ గేములో ఓడితే టోర్నీ నుంచి నిష్ర్కమించాల్సిందే. ఈ క్రమంలో భారత జట్టుకు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఓ హెచ్చరిక చేశాడు. విండీస్‌‌ను తేలికగా తీసుకోవద్దన్నాడు. ‘సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ తేలిపోయింది. అందుకే రైట్-లెఫ్ట్ కాంబినేషన్‌ అవసరమని వారు గుర్తించారు. గత మ్యాచ్‌ నుంచి నేర్చుకోవడం చాలా ముఖ్యం. వెస్టిండీస్ పూర్తిగా భిన్నమైన సవాల్. వాళ్లని తేలికగా తీసుకోలేం. వాళ్ల బ్యాటర్ల టాప్ ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లు కూడా రాణిస్తున్నారు. ప్రత్యర్థి తప్పులు చేస్తే సరైన సమయంలో శిక్షిస్తారు. వెస్టిండీస్ బ్యాటర్లను కట్టడి చేయడానికి భారత్ పక్కా ప్లాన్‌‌తో రావాలి. ఆ జట్టు బ్యాటర్లు తొలి బంతి నుంచే షాట్స్ ఆడతారు. అందుకే భారత్ తెలివిగా ఆడాలి. ప్రణాళికలతో రావాలి. ఆదివారం జరిగే మ్యాచ్ కచ్చితంగా అద్భుతంగా ఉంటుంది.’అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.


Next Story