బెంగళూరు తొక్కిసలాట.. మౌనంగా ఉండలేమంటూ బీసీసీఐ సీరియస్

by Harish |

బెంగళూరు తొక్కిసలాట.. మౌనంగా ఉండలేమంటూ బీసీసీఐ సీరియస్
X

దిశ, స్పోర్ట్స్ : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటన విషయంలో తాము మౌనంగా ఉండలేమని బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా వ్యాఖ్యానించారు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆ ఘటనపై తమకు బాధ్యత ఉందన్నాడు. ‘దీనిపై మేము మౌనంగా ఉండలేం. ఏదో ఒక సమయంలో బీసీసీఐ ఏదో ఒకటి చేయాలి. అది ఆర్సీబీకి సంబంధించిన ప్రైవేట్ వ్యవహారం. కానీ, దేశంలో జరిగే క్రికెట్ వ్యవహారాలకు బీసీసీఐ కూడా బాధ్యత తీసుకుంటుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రయత్నిస్తాం.’ అని సైకియా తెలిపారు. తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా.. 50 మంది గాయపడ్డారు. దీంతో ఈ ఘటనను బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విజయోత్సవ వేడుకలకు మార్గదర్శకాలు జారీ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.


Next Story