కేకేఆర్ కు ఊహించ‌ని షాక్‌... రూ.25 కోట్ల ప్లేయ‌ర్ డ‌కౌట్

by velandi.Saikiran |

3వ యాషెస్ టెస్ట్ లో రెండు బంతులకే డకౌట్ అయ్యాడు గ్రీన్. దీంతో కేకేఆర్ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు

కేకేఆర్ కు ఊహించ‌ని షాక్‌... రూ.25 కోట్ల ప్లేయ‌ర్ డ‌కౌట్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ మినీ వేలంలో నిన్న ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ గ్రీన్ పై కోట్ల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. అతన్ని కొనుగోలు చేసేందుకు అన్ని జట్లు చాలా ప్రయత్నాలు చేశాయి. కానీ ఆండ్రీ రస్సెల్ స్థానాన్ని భర్తీ చేసేందుకు గాను రూ. 25.20 కోట్లు పెట్టి కామెరాన్ గ్రీన్ ను కొనుగోలు చేసింది కేకేఆర్. దీంతో విదేశీ ప్లేయర్లలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా గ్రీన్ చరిత్ర సృష్టించాడు. అయితే మినీ వేలంలో కొనుగోలు చేసి 24 గంటలు కాకముందే కేకేఆర్ కు ఊహించని షాక్ ఇచ్చాడు గ్రీన్.

ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 3వ యాషెస్ టెస్ట్ లో రెండు బంతులకే డకౌట్ అయ్యాడు గ్రీన్. దీంతో కేకేఆర్ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మీరు రూ.25 కోట్లు పెట్టి కొన్న ప్లేయర్ డకౌట్ అయ్యాడు అంటూ దారుణంగా ఆడుకుంటున్నారు. అయితే ఆ టెస్ట్ మ్యాచ్ కు ఐపీఎల్ కు ఎలాంటి సంబంధం ఉండబోదని, ఐపీఎల్ 2026 టోర్నమెంట్ లో గ్రీన్ అద్భుతంగా రాణిస్తాడని కేకేఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Next Story