- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫైనల్‌కు దూసుకెళ్లిన తన్వి.. వరల్డ్ టైటిల్‌కు అడుగు దూరంలో
భారత యువ సంచలనం తన్వి శర్మ వరల్డ్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.

దిశ, స్పోర్ట్స్ : భారత యువ సంచలనం తన్వి శర్మ వరల్డ్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. గువహతి వేదికగా జరుగుతున్న వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన గర్ల్స్ సింగిల్స్ సెమీస్‌లో చైనాకు చెందిన లియు సి యాను 15-11, 15-9 తేడాతో మట్టికరిపించింది. టోర్నీలో సంచలన ప్రదర్శన చేస్తున్న తన్వి సెమీస్‌లోనూ ఏకపక్ష విజయం సాధించింది. 31 నిమిషాల్లోనే రెండు గేములను సొంతం చేసుకుంది. చైనా ప్రత్యర్థి ఆమెకు పోటీ ఇవ్వలేకపోయింది.
ఇప్పటికే పతకం ఖాయం చేసుకున్న తన్వి స్వర్ణ పతకంపై కన్నేసింది. వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకున్న ఐదో భారత షట్లర్ తన్వి. ఆమె కంటే ముందు అపర్ణ(1996), సైనా నెహ్వాల్(2006, 2008), సిరిల్ వర్మ(2015), శంకర్ ముత్తుసామీ(2022) ఉన్నారు. వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు భారత్ తరపున వరల్డ్ టైటిల్ సాధించింది సైనా(2008) మాత్రమే. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత స్వర్ణం గెలిచే అవకాశం తన్వికి దక్కింది. ఆదివారం జరిగే ఫైనల్‌లో ఆమె థాయిలాండ్‌కు చెందిన ఫీచిత్‌ప్రీచాసక్‌తో తలపడనుంది.






