భారత్‌కు షాక్.. తొలి రౌండ్‌లోనే లక్ష్యసేన్ ఔట్

by Harish |

బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆరంభంలోనే భారత్‌‌కు భారీ షాక్ తగిలింది.

భారత్‌కు షాక్.. తొలి రౌండ్‌లోనే లక్ష్యసేన్ ఔట్
X

దిశ, స్పోర్ట్స్ : బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆరంభంలోనే భారత్‌‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో లక్ష్యసేన్ 17-21, 19-21 తేడాతో వరల్డ్ నం.1, చైనాకు చెందిన షి యుకీ చేతిలో ఓడిపోయాడు. 54 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ ప్రత్యర్థికి గట్టిపోటీనిచ్చాడు. కానీ, కీలక సమయాల్లో ప్రత్యర్థిని నిలువరించలేకపోయాడు. పతకం తెస్తాడని భావించిన లక్ష్యసేన్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారిపట్టడం భారత్‌కు భారీ షాకే. 2021 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అతను కాంస్యం సాధించాడు. మహిళల డబుల్స్‌ కూడా భారత్‌‌కు తొలి రోజు నిరాశే ఎదురైంది. రుతుపర్ణ-శ్వేతపర్ణ జోడీ తొలి రౌండ్‌లో ఓడిపోయింది. బల్గేరియాకు చెందిన గాబ్రియేలా స్టోవా-స్టెఫాని స్టోవా ద్వయం 21-11, 21-11 తేడాతో గెలిచింది. స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు, స్టార్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ మంగళవారం తొలి రౌండ్‌లో తలపడనున్నారు. లక్ష్యసేన్ నిష్ర్కమించడంతో భారత్ సింధు, ప్రణయ్‌లపై పతక ఆశలు పెట్టుకుంది.


Next Story