బుమ్రా నాలుగో టెస్టు ఆడతాడా?లేదా?.. క్లారిటీ ఇచ్చిన సిరాజ్

by Harish |

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా నాలుగో టెస్టు ఆడతాడని మరో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ధ్రువీకరించాడు.

బుమ్రా నాలుగో టెస్టు ఆడతాడా?లేదా?.. క్లారిటీ ఇచ్చిన సిరాజ్
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా నాలుగో టెస్టు ఆడతాడని మరో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ధ్రువీకరించాడు. సోమవారం ఐసీసీతో సిరాజ్ మాట్లాడుతూ..‘బుమ్రా నాలుగో టెస్టు ఆడతాడు. ఇప్పటివరకు నాకు తెలిసింది అదే. ఆకాశ్ దీప్ గజ్జ సమస్య ఉంది. అతను ఈ రోజు బౌలింగ్ చేశాడు. ఇక ఫిజియోలు చూసుకుంటారు. వారి నుంచి అప్‌డేట్ రావాల్సి ఉంది. టీమ్ కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి. మనం ఓపికగా ఉండాలి. సరైన ప్రాంతాల్లో బౌలింగ్ చేయాలి. అదే మా ప్లాన్’అని చెప్పాడు. తన వర్క్‌లోడ్‌ గురించి మాట్లాడుతూ..‘దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేశం కోసం వీలైనన్ని ఆటలు ఆడాలనుకుంటున్నా.’ అని తెలిపాడు. అలాగే, మూడో టెస్టులో తాను అవుటైన తీరుపై స్పందిస్తూ..‘చాలా ఎమోషన్ అయ్యాను. 22 పరుగులతో ఓడటం బాధగా అనిపించింది. నేను అవుటవుతానని అనుకోలేదు. అది నా తప్పిదమే. అది చాలా హృదయ విదారకమైనది. ఆ మ్యాచ్‌లో మేము గెలిస్తే ఫలితం మరోలా ఉండేది. ఆ బాధ చాలా కాలం ఉంటుంది. జడ్డూ భాయ్ పోరాడాడు. సిరీస్ ఇంకా ముగియలేదు. నేను నా బ్యాటింగ్‌ మెరుగుపర్చుకోవడానికి కష్టపడుతున్నా.’ అని చెప్పుకొచ్చాడు.

Next Story