బుమ్రా సేన ప్రాక్టీస్

by Disha Web Desk 17 |
బుమ్రా సేన ప్రాక్టీస్
X

డుబ్లిన్: స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా నాయకత్వంలోని భారత జట్టు ఐర్లాండ్‌కు చేరుకుంది. మంగళవారం ప్రత్యేక విమానంలో ఐర్లాండ్‌కు బయల్దేరిన భారత ఆటగాళ్లు బుధవారం ఉదయం డుబ్లిన్‌లో దిగారు. మూడు టీ20ల సిరీస్ కోసం టీమ్ ఇండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. డుబ్లిన్‌కు చేరుకున్న తర్వాత భారత ఆటగాళ్లు సమయం వృథా చేయకుండా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేసింది.

కెప్టెన్ బుమ్రా బౌలింగ్ చేయడం ఆ వీడియోలో చూడొచ్చు. మునపటిలా బుమ్రా బౌలింగ్ చేస్తుండగా.. బ్యాటర్లు అతన్ని ఎదుర్కోవడంలో తడబడినట్టు కనిపించింది. గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధించిన బుమ్రా దాదాపు ఏడాది తర్వాత తిరిగి జాతీయ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.

అలాగే, ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో యువకులతో కూడిన జట్టునే అతనే నడిపించనున్నాడు. బుమ్రాతో మిగతా ప్లేయర్లు సైతం ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, యశస్వి జైశ్వాల్ రింకూ సింగ్, సంజూ శాంసన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. కాగా, ఈ నెల 18న డుబ్లిన్ వేదికగా జరిగే తొలి టీ20తో సిరీస్ మొదలుకానుంది. ఈ నెల 20, 23 తేదీల్లో మిగతా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి.



Next Story

Most Viewed