- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
100 వికెట్ల క్లబ్‌లో బుమ్రా.. అర్షదీప్ ఏమన్నాడంటే
డర్బన్‌లో జరిగిన తొలి టీ20లో టీమిండియా 101 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: డర్బన్‌లో జరిగిన తొలి టీ20లో టీమిండియా 101 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. భారత్ 6 వికెట్ల నష్టానికి 175 రన్స్ చేయగా, సౌతాఫ్రికా కేవలం 74 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా మరో చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందే అర్ష్‌దీప్ సింగ్ ఈ మైలురాయి అందుకున్నాడు.
ఇక బుమ్రా మాత్రం టెస్ట్, వన్డే, టీ20: మూడు ఫార్మాట్లలోనూ 100+ వికెట్లు తీసిన తొలి భారత పేసర్‌గా రికార్డులోకి ఎక్కాడు. మ్యాచ్‌లో బుమ్రా 99 వికెట్లతో బరిలోకి దిగాడు. తన స్పెల్‌లోనే డేవాల్డ్ బ్రెవిస్‌ను ఔట్ చేసి వందో వికెట్ సాధించాడు. ఆ క్షణం మైదానంలోనే అర్ష్‌దీప్ దగ్గరకు వెళ్లి గట్టిగా హత్తుకుని అభినందించాడు. ఇది చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అయిపోయారు. మ్యాచ్ అనంతరం అర్ష్‌దీప్ ఇలా అన్నాడు:
“ఈరోజు బుమ్రా భాయ్ కూడా 100 వికెట్ల క్లబ్‌లో చేరడం చాలా స్పెషల్‌గా అనిపించింది. వందో వికెట్ పడగొట్టగానే నేనే ముందు వెళ్లి హగ్ ఇచ్చేశా (నవ్వుతూ). బుమ్రా భాయ్‌తో కలిసి బౌలింగ్ చేయడం ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. బౌలర్లందరూ వికెట్లు తీస్తే కెప్టెన్ పని చాలా ఈజీ అయిపోతుంది. పవర్‌ప్లేలో మూడు ఓవర్లు బుమ్రా భాయ్‌కి లేదా నాకు ఇవ్వాలని సూర్య (సూర్యకుమార్ యాదవ్) అనుకుంటే… మేమ్మల్ని ఎక్కువగా ఉపయోగించుకునేలా చూస్తాం.”ఈ జోడీ ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్ 2026కి ముందు భారత్‌కి డెడ్లీ వెపన్‌గా మారనుంది.






