- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'కోల్డ్ ప్లే' కన్సర్ట్‌లో సందడి చేసిన బుమ్రా.. వీడియో వైరల్
ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ బ్యాండ్ 'కోల్డ్ ప్లే' ఇండియాలో కన్సర్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ బ్యాండ్ 'కోల్డ్ ప్లే' ఇండియాలో కన్సర్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన కన్సర్ట్‌లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సందడి చేశాడు. ఈ ఈవెంట్‌లో బుమ్రా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా బుమ్రాపై సింగర్ క్రిస్ మార్టిన్ ఓ స్పెషల్ పాట కూడా పాడారు. 'జస్ప్రీత్.. మై బ్యూటీఫుల్ బ్రదర్. ది బెస్ట్ బౌలర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ క్రికెట్. వుయ్ డు నాట్ ఎంజాయ్ యు డెస్ట్రాయింగ్ ఇంగ్లాండ్ విత్ వికెట్స్ ఆఫ్టర్ వికెట్స్' అంటూ ఆలపించగా బుమ్రా ఆస్వాదించారు.
అలాగే ఈ కన్సర్ట్‌లో ఇంగ్లాండ్ పై టెస్ట్ సిరీస్ లో బుమ్రా అద్భుత ప్రదర్శన తాలూకు వీడియోని కూడా ప్రదర్శించారు. దీంతో ప్రేక్షకులంతా ఒక్కసారిగా అరవడంతో ఈవెంట్ మార్మోగిపోయింది. ప్రస్తుతం 'కోల్డ్ ప్లే' కన్సర్ట్‌లో బుమ్రా సందడి చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, 21 శతాబ్దంలో ఆసియాలో అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైన మ్యాజిక్ కన్సర్ట్‌గా ఈ నరేంద్ర మోదీ స్టేడియం కోల్డ్ ప్లే కన్సర్ట్ నిలిచింది. దాదాపు 1,34,000 వేల మంది ఈ కన్సర్ట్‌కు హాజరయ్యారని తెలిసింది.






