పాకిస్థాన్ కు బుమ్రా అదిరిపోయే కౌంట‌ర్‌...ర‌వూఫ్ వికెట్ తీసి మ‌రీ

by velandi.Saikiran |

యార్కర్ వేసి హరీస్ రవూఫ్‌ వికెట్ తీశాడు బుమ్రా. అయితే వికెట్ తీసిన తర్వాత పాకిస్తాన్ జెట్స్ కింద పడిపోయాయి

పాకిస్థాన్ కు బుమ్రా అదిరిపోయే కౌంట‌ర్‌...ర‌వూఫ్ వికెట్ తీసి మ‌రీ
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా అద్భుతంగా బౌలింగ్ చేసి.. పాకిస్తాన్ బ్యాటర్లను కట్టడి చేసింది. భారీ స్కోర్ చేస్తుందనుకున్న పాకిస్తాన్ ను... 146 పరుగుల కి కట్టడి చేసింది టీమిండియా.19.1 ఓవర్లు ఆడిన పాకిస్తాన్... 146 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అయితే ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీసిన బుమ్రా... హరీస్ రవూఫ్‌ ను పెవీలియ‌న్ కు పంపించాడు.

అద్భుతమైన యార్కర్ వేసి హరీస్ రవూఫ్‌ వికెట్ తీశాడు బుమ్రా. అయితే వికెట్ తీసిన తర్వాత పాకిస్తాన్ జెట్స్ కింద పడిపోయాయి.. అన్నట్లుగా సైగ‌లు చేసి బుమ్రా అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో సైలెంట్ గా ర‌వూఫ్ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. సూప‌ర్ ఫోర్ మ్యాచ్ లో ఇండియా జెట్స్ పై ర‌వూఫ్ కూడా వెకిలీగా వ్య‌వ‌హ‌రించాడు. అందుకే బుమ్రా కౌంట‌ర్ ఇచ్చాడు. ఇది ఇలా ఉండ‌గా.. 147 ప‌రుగ‌లు ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన టీమిండియా కూడా బ్యాటింగ్ లో త‌డ‌బ‌డుతోంది. ఈ మ్యాచ్ లో ఇప్ప‌టికే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా పోరాడుతోంది. 20 ప‌రుగుల‌కే సూర్య‌, అభిషేక్ , గిల్ వికెట్లు కోల్పోయింది టీమిండియా. క్లిక్

Next Story