టీ20 ప్ర‌పంచ క‌ప్‌..క‌ష్టాల్లో భార‌త్, సంజుకు మాత్రం పండగే !

by velandi.Saikiran |

అభిషేక్ శర్మ అనారోగ్యమే. అమెరికాతో మ్యాచ్ పూర్తయిన తర్వాత అభిషేక్ శర్మ చాలా డల్ గా కనిపిస్తున్నాడు. అతనికి వైరల్ ఫీవర్ సోకింది. దానికి తోడు కడుపునొప్పి కూడా వేధిస్తోందట.

టీ20 ప్ర‌పంచ క‌ప్‌..క‌ష్టాల్లో భార‌త్, సంజుకు మాత్రం పండగే !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో భారత జట్టు పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఇండియాను గాయాల బెడద పట్టిపీడిస్తోంది. ఈ టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి జ్వరాలు లేదా గాయాలు భారత జట్టును వేధిస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా మొదటి మ్యాచ్ కు బుమ్రా దూరమైన సంగతి తెలిసిందే. అతనికి మ్యాచ్ కంటే ముందు వైరల్ ఫీవర్ సోకిందట. ఇక ఇప్పుడు అభిషేక్ శర్మకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టుతో మ్యాచ్ పూర్తయిన తర్వాత అభిషేక్ శర్మకు జ్వరం విపరీతంగా వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో ఇండియా ఆడబోయే రెండో మ్యాచ్ కు అభిషేక్ శర్మ దూరం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంజు శాంసన్ కు బంపర్ ఆఫర్ ?

టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భారత జట్టు తన తర్వాతి మ్యాచ్ నమీబియాతో ఆడనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలో ఫిబ్రవరి 12వ తేదీన జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో సంజు శాంసన్ కు బంపర్ ఆఫర్ తగిలినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం అభిషేక్ శర్మ అనారోగ్యమే. అమెరికాతో మ్యాచ్ పూర్తయిన తర్వాత అభిషేక్ శర్మ చాలా డల్ గా కనిపిస్తున్నాడు. అతనికి వైరల్ ఫీవర్ సోకింది. దానికి తోడు కడుపునొప్పి కూడా వేధిస్తోందట. ఈ తరుణంలో ఇండియా ఆడబోయే రెండవ వరల్డ్ కప్ మ్యాచ్ కు అభిషేక్ శర్మ దూరమవుతాడని అంటున్నారు. ఇదే జరిగితే, ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానంలో సంజు శాంసన్ కు ఛాన్స్ వస్తుందని అంటున్నారు. ఇప్పటికే సంజు కు ఓపెనర్ గా చేసిన అనుభవం ఉంది. న్యూజిలాండ్ తో జరిగిన ఐదు టీ20 మ్యాచ్ లలో విఫలమైనప్పటికీ, సంజు శాంస‌న్ కు అవకాశం వస్తుందని అంటున్నారు. ఇదే జరిగితే వికెట్ కీపర్ గానే కాకుండా ఓపెనర్ గా సంజు బరిలోకి దిగుతాడు. అంటే అభిషేక్ శర్మ అనారోగ్యం, సంజు శాంసన్ కు కలిసివచ్చే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రెండో మ్యాచ్ కు సిద్ధ‌మైన భార‌త జ‌ట్టు

వరల్డ్ కప్ ఎలాగైనా గెలవాలన్న కసితో ఇండియా ముందుకు వెళ్తోంది. గాయాలు వేధించినప్పటికీ కూడా మిగిలిన ప్లేయర్లతో టైటిల్ కొట్టాలన్న కసి కనిపిస్తోంది. ఈ తరుణంలో ఇండియా తన రెండవ మ్యాచ్ నమీబియాతో ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జెట్లీ వేదికగా ఫైట్ జరగనుంది. అయితే ఇప్పటికే అమెరికా జట్టుపై విజయం సాధించిన భారత జట్టు, నమీబియాను చిత్తు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ నమీబియాతో విజయం సాధిస్తే పాకిస్తాన్ జట్టుతో మరో మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. నమీబియా తో మ్యాచ్ కోసం మొన్ననే ఢిల్లీకి వచ్చింది భారత జట్టు. ఈ సందర్భంగా భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పెషల్ ట్రీట్ కూడా ఇచ్చాడు. భారత ప్లేయర్లు అంద‌రికీ విందు ఇచ్చి సర్ప్ ఫ్రైజ్‌ చేశాడు గంభీర్.

Next Story