ఒకే ఓవ‌ర్ లో 26 ప‌రుగులు, శివం దూబేను ఉతికారేసిన ప‌సికూన‌

by velandi.Saikiran |

తన మొదటి ఓవర్ లో శివం దూబేను ఉతికారేశాడు బ్రియాన్ బెన్నెట్. దూబే బౌలింగ్ లో 26 పరుగులు చేసి చుక్క‌లు చూపించాడు.

ఒకే ఓవ‌ర్ లో 26 ప‌రుగులు, శివం దూబేను ఉతికారేసిన ప‌సికూన‌
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత ఆల్ రౌండ‌ర్‌ శివం దూబే ( Shivam Dube), మంచినీళ్లు తాగినంత సులభంగా సిక్సులు కొడతాడు. అయితే అలాంటి డేంజర్ ఆల్ రౌండర్ శివం దుబే బౌలింగ్ లో పసికూన జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ ( Brian Bennett ) విధ్వంసం సృష్టించాడు. శివం దూబే బౌలింగ్ లో ఊచకోత కోశాడు బ్రియాన్ బెన్నెట్. శివం దూబే వేసిన 15వ ఓవర్ లో ఏకంగా 26 పరుగులు దండుకున్నారు జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్. భారత విధించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ విధ్వంసం సృష్టించాడు. చివరి వరకు జింబాబ్వేను గెలిపించేందుకు చాలా కష్టపడ్డాడు. కానీ తాను సెంచ‌రీ సాధించ‌లేక‌, జింబాబ్వేను గెలిపించ‌లేదు బ్రియాన్ బెన్నెట్.

శివం దూబే బౌలింగ్ లో 26 పరుగులు దండుకున్న జింబాబ్వే

భారత్ పై గెలవాలన్న కసితో అద్భుతంగా రాణించిన జింబాబ్వే ప్లేయర్ బ్రియాన్ బెన్నెట్ ( Brian Bennett )..ఆది నుంచి బౌల‌ర్ల‌పై అటాక్ చేశాడు. అత‌ని మ‌రో బ్యాట‌ర్ తోడైతే, ఇండియాను సుల‌భంగా ఓడించేవాడే. ఇక ఈ త‌రుణ‌లంఓనే శివం దూబే బౌలింగ్ లో విధ్వంసం సృష్టించాడు బ్రియాన్ బెన్నెట్. అతడు వేసిన 15వ ఓవర్ లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. అయితే ఇందులో రెండు సిక్సర్లు, రెండు బౌండరీలు ఉన్నాయి. ఒక టూడి కూడా సాధించారు. మిగిలినవన్నీ ఎక్స్ ట్రాలే కావడం గమనార్హం. ఇందులో వైడ్స్‌, నో బాల్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 6 బంతులు వేయాల్సిన ఈ ఓవర్ లో మొత్తం పది బంతులు సంధించాడు శివం దూబే. దీంతో శివం దూబే ( Shivam Dube) పరువు గంగలో కలిసింది. దీంతో దూబేను దారుణంగా ఫాన్స్ ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఆల్ రౌండర్ కు ఉన్న లక్షణాలు శివం దూబేకు లేవని.. ఇతడు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయగలరని దారుణంగా ఆడుకుంటున్నారు.

ఇది ఇలా ఉండగా సూపర్ 8 లో చెన్నై వేదికగా జరిగిన జింబాబ్వే, భారత్ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ సేన విక్టరీ కొట్టింది. జింబాబ్వే పైన ఏకంగా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత్. ఇందులో ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 256 పరుగులు సాధించింది. సూర్య కుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఇలా అందరూ సమిష్టిగా రాణించిన నేపథ్యంలో భారీష్ కూర చేయగలిగింది భారత్. ఇక ఈ లక్ష్యాన్ని జింబాబ్వే చేదించలేక ఓటమిపాలైంది. 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసిన జింబాబ్వే, 72 పరుగులు తేడాతో ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ లో భార‌త్ జ‌ట్టు చేతిలో ఓడిపోయిన జింబాబ్వే ఇంటి దారి ప‌ట్టింది. అటు భార‌త్ సెమీస్ కు మ‌రింత ద‌గ్గ‌రైంది.

Next Story