- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోచ్ మెక్‌కల్లమ్‌పై సంచలన ఆరోపణలు..డ్రెస్సింగ్ రూమ్‌లోకి మద్యం!
మద్యం తాగే ఆటగాళ్లకు మాత్రమే కోచ్ మెక్‌కలమ్ ఎక్కువగా అవకాశాలు, ప్రయారిటీ ఇస్తారని ఆరోపణలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ గురించి తెలియని వారు ఉండరు. టెస్ట్ క్రికెట్ ను కూడా టీ20 లాగా ఆడాలని దూకుడు విధానం తీసుకువచ్చిన మొనగాడు బ్రెండన్ మెక్‌కలమ్. అయితే అలాంటి ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. బీరు, మద్యం తాగే ఆటగాళ్లకు మాత్రమే ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ ఎక్కువగా అవకాశాలు, ప్రయారిటీ ఇస్తారని ఆరోపణలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.
యాషెస్ సిరీస్ మధ్యలో ఆరు రోజులు ప్లేయర్లు మద్యం తాగినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ క్రమ శిక్షణగా ప్లేయర్లను ఉంచకపోవడం వల్ల ఈ సంఘటన జరిగినట్లు చెబుతున్నారు. దానికి తోడు వరుసగా సిరీస్ లు ఓడిపోయినట్లు జట్టులోని కొంత మంది ప్లేయర్లు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మీటింగ్ లో కూడా స్టోక్స్, బ్రెండన్ మెక్‌కలమ్ ఒకరినొకరు తిట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలను బ్రెండన్ మెక్‌కలమ్ కొట్టిపారేశాడు.






