బ్రేకింగ్ న్యూస్.. అంతర్జాతీయ టెన్నిస్ కు 'స్టార్ ప్లేయర్' గుడ్ బై!

by Geesa Chandu |

ఆస్ట్రియన్ టెన్నిస్ స్టార్ డొమినిక్ థీమ్.. తన అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు.

బ్రేకింగ్ న్యూస్.. అంతర్జాతీయ టెన్నిస్ కు స్టార్ ప్లేయర్ గుడ్ బై!
X

దిశ, వెబ్ డెస్క్: ఆస్ట్రియన్ టెన్నిస్ స్టార్ డొమినిక్ థీమ్.. తన అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. యూఎస్ ఓపెన్ 2024 లో తొలి రౌండ్ లోనే థీమ్ ఓటమి పాలయ్యాడు.షెల్టాన్ తో జరిగిన ఈ మ్యాచ్ లో 4-6, 2-6, 2-6 తేడాతో వరుస సెట్లలో థీమ్ చిత్తుగా ఓడిపోయాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరమే థీమ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. మ్యాచ్ ఓడిన వెంటనే తన టెన్నిస్ కెరీర్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు థీమ్. తన మ్యాచ్ ను వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే కేవలం 30 ఏళ్లకే థీమ్ తన టెన్నిస్ కెరీర్ కు వీడ్కోలు పలకడం మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఈ సందర్భంగా డొమినిక్ థీమ్ మాట్లాడుతూ.. "ఇదే టెన్నిస్ కోర్ట్ లో తన ఏకైక టైటిల్ ను గెలిచానని, మళ్లీ చివరగా ఇదే కోర్ట్ లో తన ఆటకు వీడ్కోలు పలుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. నా కెరీర్ కు సహాయపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు" అని డొమినిక్ థీమ్ తెలిపాడు. తాజాగా తాను తీసుకున్న ఈ నిర్ణయానికి సంతృప్తిగా ఉన్నట్లు థీమ్ అన్నాడు. కాగా 2021 లో థీమ్ మణికట్టు గాయంతో తన టెన్నిస్ కెరీర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించిన సంగతి తెలిసిందే. అయితే 2020 లో థీమ్ తన యూఎస్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ లో తొలి రెండు సెట్లలో ఓడిన థీమ్, తర్వాత జరిగిన చివరి మూడు సెట్లలో వరుసగా గెలిచి, తన ప్రత్యర్థి జ్వెరేవ్ ను ఓడించి ఫైనల్ పోరులో గెలిచి టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. తర్వాత జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ లో రెండు సార్లు ఫైనల్ కు వచ్చిన థీమ్, రఫెల్ నాదల్ చేతిలో ఓడిపోయాడు. థీమ్ భవిష్యత్ టెన్నిస్ స్టార్ గా మన్ననలు పొందినప్పటికీ.. వరుస గాయాలు, నిలకడ లేకపోవడం వంటి సమస్యలతో గడిచిన నాలుగేళ్లనుంచి పేలవ ప్రద్రర్శన కనబరిచాడు. ఇప్పుడు చివరగా తన టెన్నిస్ కెరీర్ కు పూర్తిగా వీడ్కోలు ప్రకటించాడు డొమినిక్ థీమ్.

Next Story