బాయ్ కాట్ ఎఫెక్ట్‌..ప్ర‌మాదంలో టీమిండియా.. ఆసియా క‌ప్ ఛాంపియ‌న్‌ పాకిస్థాన్ కానుందా !

by velandi.Saikiran |   (  Updated:2025-09-14 10:34:59  IST  )

టీమిండియా, పాకిస్థాన్ రెండు జ‌ట్లు ఫైన‌ల్ కు వెళితే... అప్పుడు బాయ్ కాట్ తెర‌పైకి వ‌స్తుంది. అలా అని మ్యాచ్ ఆడ‌కుండా

బాయ్ కాట్ ఎఫెక్ట్‌..ప్ర‌మాదంలో టీమిండియా.. ఆసియా క‌ప్ ఛాంపియ‌న్‌ పాకిస్థాన్ కానుందా !
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ లో భాగంగా టీమిండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ మ‌ధ్య ఇవాళ మ్యాచ్ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో సోషల్ మీడియా మారుమోగుతోంది. బాయ్ కాట్ పాకిస్థాన్ మ్యాచ్ అంటూ ర‌చ్చ చేస్తున్నారు భార‌తీయులు. బీసీసీఐ అధికారులు కూడా చాలా మంది దుబాయ్ వెళ్ల‌లేద‌ట‌. ఈ మ్యాచ్ చూస్తే.. ట్రోలింగ్ కు గుర‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని సెల‌బ్రీటీలు కూడా మ్యాచ్ కు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో... బాయ్ కాట్ వ‌ల్ల టీమిండియాకు న‌ష్టం జ‌రుగుతుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

ఇవాళ్టి మ్యాచ్ ను నిజంగానే టీమిండియా బాయ్ కాట్ చేస్తే... గ్రూప్ స్టేజ్ లో మ‌రో మ్యాచ్ క‌చ్చితంగా గెలివాల్సి ఉంటుంది. ఒమ‌న్ టీంతో త‌ర్వాతి మ్యాచ్ ఆడ‌నుంది టీమిండియా. అందులో గెలిస్తే... సూప‌ర్ 4 కు చేరే ఛాన్సులు ఉంటాయి. ఒమ‌న్ కాబ‌ట్టి టీమిండియా సుల‌భంగా గెలుస్తుంది. టెన్ష‌న్ లేదు. అయితే.. ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ లో భాగంగా టీమిండియా, పాకిస్థాన్ రెండు జ‌ట్లు ఫైన‌ల్ కు వెళితే... అప్పుడు బాయ్ కాట్ తెర‌పైకి వ‌స్తుంది. అలా అని మ్యాచ్ ఆడ‌కుండా... బాయ్ కాట్ దిశ‌గా టీమిండియా ముందుకు వెళితే..అప్పుడు పాకిస్థాన్ గెలిచే ప్ర‌మాదం ఉంటుంది. అందుక‌ని.. టీమిండియా ఇవాళ్టి మ్యాచ్ ఆడాల‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

Next Story