- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 02-01తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇద్దరూ అదరగొట్టారు. సెంచరీలు, హాఫ్ సెంచరీలతో రఫ్పాడించారు. తాజాగా వీరిపై భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ (Sanjay Bangar) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స్థానాన్ని ఎన్నడూ ప్రశ్నించకూడదు. ఎన్నో సంవత్సరాలుగా వారు జట్టు కోసం ఎంతో చేశారు. ఫామ్ విషయంలో వారికి పెద్దగా ఇబ్బంది ఉండదు. వారికి ఆట కొత్త కాదు. ఎప్పుడైనా రాణించగలరు, ఎంత గ్యాప్ వచ్చినా రాణించగలరు. ఎప్పుడూ ఇతర క్రీడాకారులతో రోహిత్, విరాట్‌లను పోల్చకూడదు. ఇతరుల కంటే వారిని భిన్నంగా చూడాలి’ అని సంజయ్ బంగర్ అన్నాడు.
Next Story






