- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Border-Gavaskar Trophy: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. రెండో టెస్ట్‌కు ఆ స్టార్ బౌలర్ దూరం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో టీమిండియా (Team India) అదరగొడుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో టీమిండియా (Team India) అదరగొడుతోంది. తొలి టెస్ట్‌లో 295 పరుగుల తేడాతో కంగారూ జట్టును మట్టికరింపించింది. ఇప్పటికే ఓటమితో రగలిపోతున్న ఆసిస్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక పేసర్ జోష్ హేజిల్‌వుడ్ (Josh Hazlewood) గాయం కారణంగా రెండో టెస్టుకు దూరం అయ్యాడు. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ (Adelaide) ఓవల్ వేదికగా ప్రారంభమయ్యే ఈ పింక్ బాల్ (డే అండ్ నైట్) టెస్టుకు హేజిల్‌వుడ్ (Hazlewood) అందుబాటులో ఉండటం లేదని శనివారం క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) తెలిపింది.
అయితే, నడుము కింది భాగంలో గాయం కారణంగా తీవ్రమైన నొప్పితో హేజిల్‌వుడ్ (Hazlewood) బాధపడుతున్నట్లుగా జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. దీంతో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే, తొలిటెస్ట్‌లో జోష్ హేజిల్‌వుడ్ మొత్తం 5 వికెట్లను తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అతడి స్థానంలో ఆసిస్ జట్టు పేసన్ సీన్ అబాట్ (Sean Abbott), డొగ్గెట్ (Doggett)ను తుది జట్టులోకి తీసుకుంది.






