ఆసిస్‌కు భారీ షాక్.. పెర్త్‌లో 5 వికెట్లు తీసిన పేసర్ రెండో టెస్టుకు దూరం

by Harish |

టీమిండియాతో శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్టు‌కు ఆస్ట్రేలియా జట్టు ఖరారైంది.

ఆసిస్‌కు భారీ షాక్.. పెర్త్‌లో 5 వికెట్లు తీసిన పేసర్ రెండో టెస్టుకు దూరం
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియాతో శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్టు‌కు ఆస్ట్రేలియా జట్టు ఖరారైంది. ఒక రోజు ముందే గురువారం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఊహించినట్టే స్టార్ పేసర్ జోష్ హాజెల్‌వుడ్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. తొలి టెస్టులో అతను గాయపడిన విషయం తెలిసిందే.

పెర్త్‌లో 5 వికెట్లు పడగొట్టిన హాజెల్‌వుడ్ దూరమవడం ఆసిస్‌కు భారీ షాకే. అతని స్థానంలో మరో పేసర్ స్కాట్ బోలాండ్‌ను తీసుకున్నారు. 18 నెలల తర్వాత బోలాండ్ టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు. పెర్త్ టెస్టులో వెన్ను గాయంతో ఇబ్బందిపడిన ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ అడిలైడ్ మ్యాచ్‌కు దూరమవుతాడని వార్తలు వచ్చాయి. అయితే, టీమ్ మేనేజ్‌‌మెంట్ అతన్ని పక్కనపెట్టలేదు. మార్ష్ ఫిట్‌గానే ఉన్నాడని కెప్టెన్ కమిన్స్ ధ్రువీకరించాడు.

అరంగేట్రం మ్యాచ్‌లో నిరాశపర్చిన యువ ఓపెనర్ మెక్‌స్వీనీ జట్టులో చోటు కాపాడుకున్నాడు. హాజెల్‌వుడ్ స్థానంలో బోలాండ్ మినహా తొలి టెస్టులో ఆడిన జట్టుతోనే రెండో టెస్టులో ఆసిస్ బరిలోకి దిగనుంది. పెర్త్‌లో ఓడిన ఆస్ట్రేలియా రెండో టెస్టులో నెగ్గి పుంజుకోవాలని చూస్తున్నది.

ఆస్ట్రేలియా తుది జట్టు : ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, లబుషేన్, స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ, పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.

Next Story