"బ్లాక్"... ఇట్స్ నాటే కలర్! ఇట్స్ ఆన్ ఎమోషన్.. ట్రంప్ వ్యాఖ్యలకు ధీటుగా బైల్స్ కౌంటర్

by Geesa Chandu |   (  Updated:2024-08-03 11:03:04  IST  )

అమెరికన్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ సిమోన్ బైల్స్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

బ్లాక్... ఇట్స్ నాటే కలర్! ఇట్స్ ఆన్ ఎమోషన్.. ట్రంప్ వ్యాఖ్యలకు ధీటుగా బైల్స్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికన్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ సిమోన్ బైల్స్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్రాన్స్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో పసిడి పతకాన్ని సొంతం చేసుకొని మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బైల్స్ ట్రంప్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. "జిమ్నాస్టిక్స్ లో బంగారు పతకాలు గెలుచుకోవడం నా బ్లాక్ జాబ్.. ఇంకా ఈ బ్లాక్ జాబ్ అంటేనే నాకు మహా ఇష్టం" అంటూ ఆమె రాసుకొచ్చారు.

అయితే ఇక్కడ అసలు విషయమేంటంటే యూఎస్ మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల వలస దార్లను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. వలస దారులు పెద్ద మొత్తంలో దేశంలోకి వచ్చి స్థానికుల ఉద్యోగ అవకాశాలను దోచుకుంటున్నారని, దీని వల్లనే అమెరికన్ ప్రజలు నిరుద్యోగ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. వలసదారులు చేసే ఉద్యోగాలను 'బ్లాక్ జాబ్స్' గా పేర్కొనటంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇవే విషయాలను ఆయన తరచూ తన ర్యాలీలలో ఉపయోగిస్తున్నారు. ఈ మాటలతో స్థానిక ఆమెరికన్లలో భయన్ని, వ్యతిరేకతను రేకెత్తిస్తున్నారంటూ పలువురు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఒలింపిక్ పతక విజేత సిమోన్ బైల్స్ చేసిన పోస్ట్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఐతే ఈమె గత ఒలింపిక్స్ లో కూడా రెండు చొప్పున పసిడిని సొంతం చేసుకోవటంతో పాటూ మొత్తంగా తొమ్మిది పతకాలను సొంతం చేసుకున్న మొదటి అమెరికన్ జిమ్నాస్ట్ గా చరిత్ర సృష్టించింది.

Next Story